Pavitra Lokesh: ఆ ఇద్దరు హీరోలంటే పవిత్రా లోకేష్‌కి క్రష్ అట.. ఎవరో తెలుసా.?

|

May 30, 2023 | 4:09 PM

పవిత్రా లోకేష్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు పెద్ద సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు..

Pavitra Lokesh: ఆ ఇద్దరు హీరోలంటే పవిత్రా లోకేష్‌కి క్రష్ అట.. ఎవరో తెలుసా.?
Pavitra Lokesh
Follow us on

పవిత్రా లోకేష్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు పెద్ద సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు.. పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే సీనియర్ నటుడు నరేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఈ నెల 26న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎక్కడ చూసినా ఈ జంటే కనిపించింది. ఇద్దరూ కలిసి పలు టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు. ఇక నరేష్ ఓ సందర్భంలో.. పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పడం గమనార్హం. అటు పవిత్రా లోకేష్ తనకు ఇద్దరు హీరోలపై క్రష్ ఉందని స్వయంగా వెల్లడించింది.

‘నేను ఆరు లేదా ఏడో తరగతిలో ఉన్నప్పుడు నాగార్జున ‘గీతాంజలి’ మూవీ విడుదలైంది. ఆ సమయంలో ఇలాంటి వాడు భర్తగా రావాలని ఫీలింగ్ ఏర్పడింది. నా ఫస్ట్ క్రష్ నాగార్జునే. అదే సమయంలో ప్రకాష్ రాజ్ కూడా తనకు ఇష్టమని చెప్పింది. ఆయనతో చాలా సినిమాలు నటించాను’ అని పవిత్రా లోకేష్ పేర్కొంది. కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.