
కింగ్ నాగార్జున హీరోగతా నటించిన నయా మూవీ నా సామిరంగ. కొరియోగ్రాఫర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న నా సామిరంగ సినిమా రిలీజ్ అయ్యింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. నా సామిరంగ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. ఈ సినిమాలో నాగార్జున తో పాటు అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్ కీలక పాత్రల్లో నటించారు. విలేజ్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను పర్లేదు అనిపించుకుంది.
సంక్రాంతికి భారీ సినిమాలు పోటీ పడ్డాయి. అయినా కూడా వెనక్కి తగ్గకుండా నా సామిరంగ సినిమా రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాలు ఇప్పటికే తమ ఓటీటీ పార్ట్నర్ లను ఫిక్స్ చేసుకొని రిలీజ్ కు డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో నాసామిరంగ సినిమా కూడా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా సరిగా 45 రోజులకు ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. మార్చ్ సెకండ్ వీక్ లో నాసామిరంగ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ నాసామిరంగ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. త్వరలోనే డిస్ని హాట్ స్టార్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు.
Another Beautiful Melody from @mmkeeravaani garu ❤️
Listen & Enjoy #InkaInka
▶️ https://t.co/h8V0NxtjN9#NaaSaamiRanga #NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthi@allarinaresh @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @SS_Screens @boselyricist pic.twitter.com/A4oV3alP6l
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి