Nagarjuna: అభిమానికి హీరో నాగార్జున క్షమాపణలు.. ఇకపై అలా జరగదంటూ..

అభిమాన హీరోలతో ఒక్కసారైనా మాట్లాడాలని, ఫొటో దిగాలని అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. అనుకోని సందర్భాల్లో తమ హీరో ఎదురు పడితే వారిఆనందానికి అవధులుండవు. అదే క్షణంలో వారిని కలిసేందుకు భద్రతను సైతం లెక్కచేయకుండా సాహసాలు చేస్తుంటారు.

Nagarjuna: అభిమానికి హీరో నాగార్జున క్షమాపణలు.. ఇకపై అలా జరగదంటూ..
Nagarjuna

Updated on: Jun 24, 2024 | 5:49 PM

అభిమాన హీరోలతో ఒక్కసారైనా మాట్లాడాలని, ఫొటో దిగాలని అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. అనుకోని సందర్భాల్లో తమ హీరో ఎదురు పడితే వారిఆనందానికి అవధులుండవు. అదే క్షణంలో వారిని కలిసేందుకు భద్రతను సైతం లెక్కచేయకుండా సాహసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు అభిమానుల ఉత్సాహాన్ని చూసి సెలబ్రిటీలే దగ్గరికి వెళ్లి మరీ సెల్ఫీలు దిగుతుంటారు. కానీ చాలా సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది చేతిలో అభిమానులకు భంగపాటు తప్పదు. ఇలాంటివన్నీ ఎక్కువగా ప్రయాణాల్లోనే జరుగుతుంటాయి. తాజాగా అగ్రహీరో అక్కినేని నాగార్జున విషయంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. దీంతో ఆయన ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తున్న నాగార్జునను చూసిన ఓ అభిమాని, ఆయనను కలిసేందుకు ముందుకు దూసుకువచ్చాడు. అయితే క్షణాల్లో అలర్టయిన సెక్యూరిటీ సిబ్బంది ఒకరు సదరు వ్యక్తిని పక్కకు లాగేశాడు. ఆ సమయంలో ఈ విషయం నాగార్జున దృష్టికి వచ్చినట్లు వీడియోలో కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి ఎక్స్‌ర్‌)లో పోస్టు చేశాడు. దీంతో నాగార్జున స్పందించారు. ఈ ఘటన నా దృష్టికి వచ్చింది. ఇలాంటిది జరిగి ఉండాల్సింది కాదు. సదరు వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను అంటూ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు.

ఇది చదవండి: ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.? కుర్రాళ్లను పిచ్చెక్కించే అందం, పైగా గ్లోబల్ స్టార్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us