Naga Chaitanya: సమంతది మంచి మనసు.. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలి: నాగచైతన్య ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

|

May 05, 2023 | 7:33 PM

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటిఫుల్‌ జోడీగా నాగచైతన్య- సమంతలకు మంచి పేరుంది. ఆన్‌ స్ర్కీన్‌, ఆఫ్‌ స్ర్కీన్‌ అయినా ఈ జంటకు బోలెడు మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అలాంటి జంట విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికీ వారిద్దరూ మళ్లీ కలిసిపోతే చూడాలనుకునే ఫ్యాన్స్‌ చాలామంది ఉన్నారు.

Naga Chaitanya: సమంతది మంచి మనసు.. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలి: నాగచైతన్య ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Naga Chaitanya, Samantha
Follow us on

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటిఫుల్‌ జోడీగా నాగచైతన్య- సమంతలకు మంచి పేరుంది. ఆన్‌ స్ర్కీన్‌, ఆఫ్‌ స్ర్కీన్‌ అయినా ఈ జంటకు బోలెడు మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అలాంటి జంట విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికీ వారిద్దరూ మళ్లీ కలిసిపోతే చూడాలనుకునే ఫ్యాన్స్‌ చాలామంది ఉన్నారు. విడాకుల తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీగా మారిపోయారు నాగచైతన్య, సామ్‌. ఇటవల శాకుంతలం సినిమాతో సామ్‌ ప్రేక్షకులను పలకరించగా, మరికొద్ది రోజుల్లో నాగ చైతన్య నటించిన కస్టడీ మూవీ గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ మే12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్‌, టీజర్లు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదిలా ఉంటే కస్టడీ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన నాగచైతన్య తన పర్సనల్ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా సమంతతో విడాకుల వ్యవహారంపై మొదటిసారి పెదవి విప్పాడు.

అందుకే మా ఇద్దరి మధ్య టర్మ్స్‌ దెబ్బతిన్నాయి..

‘సమంత, నేను విడిపోయి రెండేళ్లు అవుతోంది. చట్టప్రకారం విడాకులు తీసుకుని ఏడాది అవుతోంది. న్యాయస్థానం కూడా మాకు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మేము మా జీవితాల్లో సాఫీగా ముందుకు సాగిపోతున్నాం. మా లైఫ్‌లోని ప్రతి దశను నేను గౌరవిస్తున్నా. సమంత మంచి మనిషి. ఆమె ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. సోషల్‌ మీడియాలో వచ్చిన కొన్ని వదంతుల వల్లే మా మధ్య టర్మ్స్‌ ఇబ్బందికరంగా మారాయి. ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు జనాల్లోకి వెళ్లింది. ఇది నన్ను ఎంతగానో బాధపెట్టింది. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో మరో చెత్త విషయం ఏమిటంటే.. నాతో ఎలాంటి సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగారు. అసంబద్ధమైన వార్తలు , పుకార్లు సృష్టించడం వల్ల ఆ సదరు వ్యక్తిని అగౌరవపరచినట్లు అయ్యింది. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత జీవితంపై పలువురు నన్ను ప్రశ్నిస్తుంటారు. మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అలాంటి ప్రశ్నలకు మౌనంగా ఉండేవాడిని. కాకపోతే ఇప్పటికీ వాళ్లు నా పెళ్లి, విడాకుల గురించే ఎందుకు మాట్లాడుతున్నారో, వదంతులు సృష్టిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు’ అని ఒకింత అసహనం వ్యక్తం చేశాడు చైతూ.

 

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.