Love Story: ‘లవ్ స్టోరీ’ సినిమాకు జై కొడుతున్న జనం.. రెండోవారం కూడా తగ్గని జోరు..

|

Oct 03, 2021 | 4:16 PM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఫిదా బ్యూటీ సాయి పల్లవి కలిసి నటించిన సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా  ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది..

Love Story: లవ్ స్టోరీ సినిమాకు జై కొడుతున్న జనం.. రెండోవారం కూడా తగ్గని జోరు..
Love Story
Follow us on

Love Story: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఫిదా బ్యూటీ సాయి పల్లవి కలిసి నటించిన సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది.. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సెప్టెంబర్ 24 న రిలీజ్ అయిన ఈ సినిమా  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస వాయిదాల అనంతరం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో లేదో అని నిర్మాతలు.. డైరెక్టర్, చిత్రయూనిట్ అనేక సందేహాలు వ్యక్తం చేశారు. కానీ వారి అంచనాలకు మించి మొదటి రోజు నుంచే రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

థియేటర్లలో చాలా రోజుల తర్వాత మళ్లీ సందడి నెలకొంది. సినిమా విడుదలై రెండు వారాలు అవుతున్నా థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల సందడి తగ్గలేదు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు అద్భుతామనే చెప్పాలి.  ఈ వారం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే హాలీవుడ్ బాండ్ మూవీ విడుదలైనా…లవ్ స్టోరీ సినిమా కోసం ప్రేక్షకులు జై కొట్టారు. దాంతో లవ్ స్టోరీకి సెకండ్ వీక్ సైతం మంచి కలెక్షన్లు వస్తున్నాయని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Vikram : కమల్ హాసన్- లోకేష్ కనగరాజ్ కాంబోలో రానున్న ‘విక్రమ్’.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్న యూనివర్సల్ హీరో…

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో.. కనీళ్ళు వస్తున్నాయంటూ ఎమోషనల్ అయిన నాగ్..

MAA Elections 2021: హోరాహోరీగాఎన్నికల ప్రచారం.. నటసింహంను కలిసిన మంచు విష్ణు..