Naga Chaitanya: కన్ఫ్యూజ్ కాకండి.. నాగ్ కాదు.. నాగ చైతన్యనే.. నాగార్జున వింటేజ్ లుక్‏లో చైతూ..

'గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి.. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది'

Naga Chaitanya: కన్ఫ్యూజ్ కాకండి.. నాగ్ కాదు.. నాగ చైతన్యనే.. నాగార్జున వింటేజ్ లుక్‏లో చైతూ..
Naga Chaitanya

Updated on: Mar 17, 2023 | 7:29 AM

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తోన్న ఈ ద్విభాషా చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇందులో నటుడు అరవింద్ స్వామి కీలకపాత్రలో నటిస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి గురువారం టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో చై డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి.. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది’ అంటూ చైతూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ టీజర్ లో చైతూ లుక్ కు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

తాజాగా విడుదలైన టీజర్ లో చైతూ.. ఒకప్పటి నాగార్జున వింటేజ్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు. కొన్ని క్షణాలపాటు అప్పటి నాగార్జునను గుర్తుచేశారు చైతూ. ఇది చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాను తెలుగుతోపాటు.. తమిళంలో మే 12న విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రానికి ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి కీలకపాత్రలలో కనిపించనున్నారు. బంగార్రాజు తర్వాత మరోసారి కృతి శెట్టి, చైతూ జంటగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us