పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ – ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ని తీసుకున్నారు. అలానే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని కీలక పాత్రలో నటించనున్నారు. పాన్ ఇంటర్నేషనల్ గా భారీ కాస్టింగ్ తో రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ప్రభాస్ సినిమా సైన్స్ ఫిక్షన్ కథతో రాబోతుందంటూ మద్దతినుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపైనా ఇంతవరకు చిత్రయూనిట్ కూడా స్పందించలేదు. దాంతో చాలా మంది అది నిజమే అని ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ ఇటీవల ఆంథాలజీ కాన్సెప్టేడ్ ‘ఎక్స్-లైఫ్’ అనే వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ కు దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ కాన్సెప్ట్ ఆద్యంతం సైన్స్ ఫిక్షన్ టచ్ తో నడిచింది. దాంతో ప్రభాస్ పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ కి ఇదే టీజర్ లాంటిదని అభిమానులు భావిస్తున్నారు. ఈ తరహా సినిమాలు హాలీవుడ్ లో మనం చూస్తూ ఉంటాం. ఇక ప్రభాస్ సినిమా నిజంగా సైన్స్ ఫిక్షన్ అయితే తెలుగు ప్రేక్షకులకు ఇదో కొత్త అనుభూతి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :
గోపీచంద్ సరసన మరో సారి ఆ హీరోయిన్.. ‘పక్క కమర్షియల్’ కోసం హీరోయిన్ ను ఫిక్స్ చేసిన మారుతి