Vikarabad: హమ్మయ్య మిస్టరీ వీడింది.. పంటపొలాల్లో ఆకాశం నుంచి పడ్డ వింత పరికరం ఏంటంటే..?

|

Dec 07, 2022 | 4:04 PM

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ల్యాండ్ అయిన ‘ఆదిత్య 369’ సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటం మిస్టరీ వీడింది.

Vikarabad: హమ్మయ్య మిస్టరీ వీడింది.. పంటపొలాల్లో ఆకాశం నుంచి పడ్డ వింత పరికరం ఏంటంటే..?
Mysterious Object in Vikarabad
Follow us on

సైన్స్ ఫిక్షన్‌ ఆదిత్య 369 మూవీ లాగే ఆదిత్య 2022 మెషిన్ అంతు చిక్కని మిస్టరీగా మారింది. ఆకాశంలో మిల మిల మెరుపులా మెరిసిన ఓ విచిత్ర దృశ్యం.. ఒక్కసారిగా భూమిపై పడిపోయింది. ఇది ఇంచు మించు ఆదిత్య 369 మూవీలోని టైమ్‌ మెషిన్‌లాగే ఉంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ప్రత్యక్షమైన వింత మెషీన్ కొన్ని గంటల పాటు జనాన్ని వణికించింది. అచ్చు ఆదిత్య 369 సినిమా తరహాలో ఉందీ మెషిన్‌. నేలను తాకేలా ఉన్న డోర్‌.. చుట్టూ అద్దాలను తలపించే కిటికీలు.. బెలూన్ ఆధారంగా వచ్చి నేలపై వాలిందీ శకటం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక జనం టెన్షన్ పడ్డారు. గ్రహాంతర శకటం అంటూ జోరుగా చర్చ జరిగింది.

ఈ వింత మెషీన్‌ను చూసేందుకు జనాలు భారీ ఎత్తున తరలివచ్చారు. రెండు గంటల పాటు నింగిలో చక్కర్లు కొట్టి ఆ తర్వాత నేలపై కుప్పకూలిపోయింది. జనాల్లో భయాందోళనలతో అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వికారాబాద్‌లో ల్యాండ్ అయ్యింది హలో స్పేస్‌ మెషిన్‌ తాలూకా రీసెర్చ్‌ హీలియం బెలూన్‌ అని స్పష్టం చేశారు. స్పెయిన్ మ్యాడ్రిడ్‌లో ఏర్పాటైన సంస్థ.. స్పేస్ టూరిజం కోసం జరుగుతున్న ప్రయోగాల్లో ఇదీ ఒకటని తేల్చారు. బెలూన్‌ ఫెసిలిటీ ఆఫ్‌ టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో దీన్ని పంపినట్లు తెలిపారు. ఈ  ప్రయోగం భారత ప్రభుత్వం సహాకారంతోనే జరిగినట్లు స్పష్టం చేశారు.

ఐదు రోజులు స్పేస్‌లో ఉండేలా ఈ ప్రయోగం జరిగింది. భయాందోళనల మధ్య అధికారులు ప్రయోగమని క్లారిటీ ఇవ్వడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే  ఇంత భారీ ఆకారం, బరువున్న మెషీన్ ఇళ్లపైనో, జనం పైనో పడితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..