Ramana Gogula: రమణ గోగుల ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తారు.. కారణమేంటో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రమణ గోగుల గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆయన పాడిన 'గోదారి గట్టు మీద రామ చిలకవే' ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే రమణ గోగుల ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తుంటారు. మరి దాని వెనక కథేంటో తెలుసుకుందాం రండి.

Ramana Gogula: రమణ గోగుల ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తారు.. కారణమేంటో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు
Music Director Ramana Gogula

Updated on: Jan 16, 2026 | 3:24 PM

రమణ గోగుల.. తెలుగు ఆడియెన్స్ కు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా హుషారైన పాటలకు రమణ గోగుల కేరాఫ్ అడ్రస్. ప్రేమంటే ఇదేరా, తమ్ముడు, బద్రి, యువరాజు, జానీ, మౌనమేలనోయి, లక్ష్మీ, సీతారాముడు, చిన్నోడు, అన్నవరం, యోగి, వియ్యాల వారి కయ్యాలు, బోణీ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఇలా పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా ఎన్నో పాటలు పాడాడు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలంటే రమణ గోగుల మ్యూజిక్, పాటలు ఉండాల్సిందే. యూత్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రమణ గోగుల 2013 తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అమెరికా వెళ్లి అక్కడే జాబ్ చేసుకుంటూ ఉండిపోయారు. అయితే మళ్లీ గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారీ మ్యూజిక్ డైరెక్టర్. ‘గోదారి గట్టు మీద’ సాంగ్ తో బ్లాక్ బస్టర్ రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ ఈ సాంగ్ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంది.

హుషారైన పాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రమణ గోగుల ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తుంటారు. అయితే దీని వెనక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. ఒక సందర్భంలో తన గుండు వెనక ఉన్న కథను అందరితో పంచుకున్నాడీ మ్యూజిక్ డైరెక్టర్. నాది ఒరిజినల్ గుండు కాదు. ఎప్పటికప్పుడు జుట్టును గీకేస్తానని. నేను అలా చేయడానికి ఓ కారణం ఉంది. పవన్ కల్యాణ్ తో ‘జానీ’ మూవీ చేస్తున్న టైంలో నా భార్య నిండు గర్భంతో ఉంది . డాక్టర్స్ ఏమో డెలివరీ కష్టం అన్నారు. దాని గురించే ఆలోచిస్తూ ఆఫీస్‌లో డల్‍‌గా ఉండిపోయాను. ఆ సమయంలో మా కీ బోర్డ్ ప్లేయర్ ఒకతను నా దగ్గరకు వచ్చి ఏంటి సార్ అలా ఉన్నారని అడిగాడు. దీంతో నా విషయమంతా చెప్పా. మీరేం ఆలోచించకుండా ఒకసారి తిరుపతికి వెళ్లి రండి సార్, అంతా సెట్ అయిపోద్ది అని చెప్పాడు. సరే అని తిరుమలకు వెళ్లి అక్కడే నా జుత్తంతా దేవుడికి ఇచ్చేసి వచ్చా. అలా చేసిన తర్వాత నా భార్యకు నార్మల్ డెలివరీ అయింది. ఇక అప్పుడే డిసైడ్ అయ్యాను. ఇక జీవితంలో నా జుత్తుని పెంచుకోకూడదని’ అని రమణ గోగుల చెప్పుకొచ్చారు. అలా మొత్తానికి తన భార్యపై తనకున్న ప్రేమను అలా చాంటున్నారట ఈ మ్యూజిక్ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.