Mani Sharma: “వాళ్ళకే కాదు..నాకూ ఒక్క సినిమా ఇవ్వండి”.. మణిశర్మ కామెంట్స్ వింటే కన్నీరు ఆగదు

స్టార్ హీరోల సినిమాలు అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మనే ఎంచుకునే వారు. ఆయా హీరోల ఇమేజ్ కు తగ్గట్టు అదిరిపోయే మ్యూజిక్ అందించే వారు మణిశర్మ. ఇప్పటికి ఆయన అందించిన పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. చిరంజీవి , నాగార్జున, వెంకటేష్ , బాలకృష్ణ లాంటి హీరోలతో పాటు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ లాంటి హీరోలకు కూడా సంగీతం అందించారు మణిశర్మ.

Mani Sharma: వాళ్ళకే కాదు..నాకూ ఒక్క సినిమా ఇవ్వండి.. మణిశర్మ కామెంట్స్ వింటే కన్నీరు ఆగదు
Mani Sharma

Updated on: Jan 03, 2024 | 2:39 PM

మణిశర్మ.. మెలోడీ బ్రహ్మ గా ఒకప్పుడు ఆయన పేరు మారుమ్రోగిపోయింది. సినిమాలకు ఆయన మ్యూజిక్ తో ప్రాణం పోసేవారు. స్టార్ హీరోల సినిమాలు అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మనే ఎంచుకునే వారు. ఆయా హీరోల ఇమేజ్ కు తగ్గట్టు అదిరిపోయే మ్యూజిక్ అందించే వారు మణిశర్మ. ఇప్పటికి ఆయన అందించిన పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. చిరంజీవి , నాగార్జున, వెంకటేష్ , బాలకృష్ణ లాంటి హీరోలతో పాటు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ లాంటి హీరోలకు కూడా సంగీతం అందించారు మణిశర్మ. ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న మణిశర్మ ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది.

ఇప్పుడు మణిశర్మ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ హవా తగ్గింది. దేవీ శ్రీ ప్రసాద్, తమన్, అనిరుధ్ ఈ ముగ్గురి పేర్లే వినిపిస్తున్నాయి. ఎలాంటి సినిమా అయినా సరే ఈ పేర్లే రిపీట్ అవుతున్నాయి. ఒకప్పుడు మణిశర్మను ఎంచుకున్న హీరోలు కూడా ఇప్పుడు ఆయనను పక్కన పెట్టేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ ఇదే విషయం పై అసహనం వ్యక్తం చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ మాట్లాడుతూ.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అందరికి అవకాశం ఇవ్వాలని అన్నారు. ఒక్కటే బాధగా ఉంది .. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అందరికి అవకాశాలు ఇస్తే ఆడియన్స్ కూడా కొత్తగా, వెరైటీగా ఉంటుంది. దేవీ శ్రీ ప్రసాద్ కు ఒక సినిమా , తమన్ కు ఒక సినిమా.. నాకు ఒక సినిమా ఇస్తే బాగుంటుంది. పోనీ వాళ్లకు రెండు సినిమాలు ఇచ్చి నాకు ఒక్క సినిమా ఇచ్చిన బాగుండు.. అదే కొంచం హర్టింగ్ గా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు మణిశర్మ. ఇప్పుడు ఆయన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను ఇప్పుడు ఇలా చూస్తే గుండె తరుక్కుపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..

మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..