Devara Teaser: ‘దేవర’ టీజర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అనిరుధ్.. ఆ ట్వీట్‏తో హైప్ పెంచేసిన మ్యూజిక్ డైరెక్టర్..

ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్ ఊరమాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచాయి. ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ తార జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Devara Teaser: దేవర టీజర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అనిరుధ్.. ఆ ట్వీట్‏తో హైప్ పెంచేసిన మ్యూజిక్ డైరెక్టర్..
Devara Movie

Updated on: Dec 27, 2023 | 8:50 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘దేవర’. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తోన్న ఈ సినిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్ ఊరమాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచాయి. ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ తార జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల విడుదలైన సలార్ సినిమాతోనే దేవర టీజర్ రాబోతుందని టాక్ నడిచింది. కానీ అందుకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ఇప్పుడు మరోసారి దేవర టీజర్ ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతుంది. అందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ టీజర్ పై ట్వీట్ చేయడమే. దేవర టీజర్ కోసం ఎంతో ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. అందరూ పులిని అభినందించాల్సిందే అంటూ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివను ట్యాగ్ చేశాడు. దీంతో దేవర టీజర్ పై మరింత హైప్ పెరిగిపోయింది.

దీంతో ఇప్పటికే దేవర టీజర్ రెడీ అయిందని తెలుస్తోంది. ఇందుకు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చినట్లు అర్థమైపోతుంది. ప్రస్తుతం డెవిల్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ సైతం దేవర సినిమా టీజర్ గురించి మాట్లాడారు. దీంతో న్యూఇయర్ కానుకగా టీజర్ రాబోతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. దేవర చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ షూరు చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.