
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘అఖండ 2 – తాండవం’. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి సత్తా చాటేందుకు బాలయ్య సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూకట్‌పల్లి లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోండగా ఆది పినిశెట్టి విలన్‌గా కనిపిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో శుక్రవరం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, యాక్టర్ హర్షాలీ మల్హోత్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ..”తెలుగులో నా కెరీర్ ఇంత బాగా ఉండటానికి కారణం బోయపాటి శ్రీను. సరైనోడులో వైరం ధనుష్ క్యారెక్టర్ నా కెరీర్‌ను మార్చేసింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బోయపాటి గారికి థ్యాంక్యూ. బాలయ్య గారు మోస్ట్ కూలెస్ట్, యంగెస్ట్ యాక్టర్. డిసెంబర్ 5 అఖండ తాండవం వచ్చేయండి థియేటర్స్‌కు” అని అన్నారు.
అలాగే సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. ” అఖండ గురించి థమన్ గారూ చాలా గొప్పగా చెప్పేవాళ్లు. ఫిబ్రవరిలో కుంభమేళా ఉంది.. అప్పుడే వచ్చింది ఈ సినిమాలో క్యారెక్టర్. బోయపాటి గారు చెప్పే యాక్షన్, కట్‌లోనే ఎనర్జీ ఉంది. బాలయ్య గారు ఉంటే ఫుల్ ఆన్ ఎనర్జీ” అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్‌తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..
థమన్ మాట్లాడుతూ.. “అరుణాచలం దర్శనం చేసుకోవాలంటే అదృష్టం చేసుకోవాలి.. అలాగే ఈ అఖండ చేయాలంటే చాలా బలం కావాలి. ఇది థమన్ మ్యూజిక్ కాదు.. ఆ శివుడు చేయిస్తున్నాడు. అఖండ 1లోనే అన్నీ చేసాం.. 2లో ఏం చేస్తాం అనుకున్నాను.. ఇలాంటి సినిమా చేయాలంటే అదృష్టం చాలా ఉండాలి. అది శివుడి రూపంలో బాలయ్య గారిని చూస్తుంటే.. -14 డిగ్రీస్‌లో కష్టపడ్డారు. బోయపాటి గారు రాసిందానికి 1000 పర్సెంట్ ఇస్తాడు బాలయ్య. కొన్ని సినిమాలకు చాలా చెప్తాం కానీ ఈ సినిమాకు చేతులెత్తి దండం పెడతాం. ఆదికి చాలా మంచి పేరు వస్తుంది. దూకుడు, ఆగడు తర్వాత 14 రీల్స్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది. బాలయ్య గారితో సినిమా అంటే 10 ఎగ్జామ్ రాసినట్లే.. ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉండాలి. మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి..” అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..