ఇండస్ట్రీలో తిరుగులేని హీరో.. ఆ ఒక్క తప్పుతో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.. చివరిరోజుల్లో

సినిమా పరిశ్రమలో ఒక విజయవంతమైన నటుడిగా, నిర్మాతగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మురళీ మోహన్ స్థిరపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఎంతోమంది సినీ ప్రముఖులు తమ కెరీర్లో తప్పులు చేసి, ఆర్థికంగా ఎలా దెబ్బతిన్నారో వివరించారు. విజయాలు సాధించినప్పటికీ, సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల చాలామంది చివరికి ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పుకోచ్చారు.

ఇండస్ట్రీలో తిరుగులేని హీరో.. ఆ ఒక్క తప్పుతో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.. చివరిరోజుల్లో
Hero

Updated on: Aug 13, 2026 | 4:34 PM

సినీ ప్రముఖుడు, నటుడు, నిర్మాతయైన మురళీ మోహన్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమలోని విజయం, అపజయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే కత్తి కాంతారావు, రాజబాబు, హర్నాథ్, పద్మనాభం వంటి పలువురు నటుల కెరీర్‌లో ఎదురైన వైఫల్యాలకు గల కారణాలను ఆయన స్పష్టం చేశారు. సొంతంగా సినిమాలు నిర్మించడం, తమ స్థాయికి మించి హీరో పాత్రలు పోషించడం, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వంటివి అపజయానికి దారితీశాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాంతారావు హీరోగా సక్సెస్ అయ్యారని, ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ, నిర్మాతగా మారి దెబ్బతిన్నారని, చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. నిర్మాతగా మారకుండా ఉండుంటే ఆయన స్థాయి మరోలా ఉండేది అని మురళీమోహన్ అన్నారు.

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది

మురళీ మోహన్ తన విజయ రహస్యాన్ని పంచుకుంటూ, తన సోదరుడు కిషోర్ క్రమశిక్షణ, ఆర్థిక నిర్వహణ తమ నిర్మాణ సంస్థ విజయానికి పునాదులని వివరించారు. బడ్జెట్ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా, రూపాయి కూడా వృధా కాకుండా చూసుకునేవాడని తెలిపారు. స్క్రిప్ట్ ఎంపిక నుంచి నటీనటుల ఎంపిక వరకు ప్రతి విషయంలోనూ కఠినమైన లెక్కలు ఉండేవని పేర్కొన్నారు. ఒక పాత్రకు అవసరమైన రెమ్యూనరేషన్‌కు మించి వెచ్చించేవారు కాదని, ప్రత్యామ్నాయ నటీనటులను కూడా సిద్ధంగా ఉంచుకునేవారని వెల్లడించారు. తాము అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా పూర్తి చేసేవారని, ఇది తమ ఆర్థిక స్థిరత్వానికి ముఖ్య కారణమని చెప్పారు.

ఇది కూడా చదవండి :అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

అలాగే, మురళీ మోహన్ గారు దివంగత మహానటి సావిత్రితో తన అనుభవాలను పంచుకున్నారు. “భారతంలో ఒక అమ్మాయి” సినిమాలో సావిత్రి తన తల్లి పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఒక షాట్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్  గురించి వివరిస్తూ, డైలాగులు చెప్పడంలో కొద్దిగా ఆలస్యం చేసినప్పటికీ, ఆ సమయంలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతమని, అవి చూసి తాను ఆమె కాళ్ళకు దండం పెట్టానని తెలిపారు. అది మహానటి గొప్పతనమని ప్రశంసించారు. సావిత్రి షూటింగ్‌కు వచ్చినా లేదా సెట్‌కు వచ్చినా ఆమెను చూసి అందరూ ఎంతో గౌరవించేవారని మురళీ మోహన్ గారు చెప్పారు. ఆమె ఎంతటి గొప్ప నటి అయినా, తన సహనటులకు కష్టం వస్తే తట్టుకోలేదని, ఎవరైనా ఆర్థిక సాయం కోరితే తన దగ్గర ఉన్నదంతా ఇచ్చి సహాయం చేసేవారని పేర్కొన్నారు

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us