Tollywood: ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ గందరగోళం.. కన్ఫ్యూజ్‏లో ఫ్యాన్స్..

తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ గందరగోళం నడుస్తుంది. ఏ సినిమా ఎప్పుడొస్తుందో ఎవరికీ క్లారిటీ లేదు. ఓ డేట్ అనౌన్స్ చేస్తున్నారు.. కానీ ఆ రోజు కాకుండా ఎప్పుడెప్పుడో వస్తున్నారు. ఒక్కటో రెండో కాదు.. చాలా సినిమాలకు ఇదే జరుగుతుంది. తాజాగా సలార్ వాయిదా పడిందనే విషయం తెలియగానే.. సెప్టెంబర్ 28పై ఖర్చీఫ్ వేసారు రామ్. ఈయన స్కంద సెప్టెంబర్ 15 నుంచి 28కి ఫిక్స్ అయింది.

Tollywood: ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ గందరగోళం.. కన్ఫ్యూజ్‏లో ఫ్యాన్స్..
Prabhas Salaar

Edited By:

Updated on: Sep 05, 2023 | 10:47 PM

సలార్ పోస్ట్‌పోన్ అయిందనే వార్త ఇంకా అధికారికంగా చెప్పలేదు మేకర్స్.. కానీ అప్పుడే అనధికారికంగా అంతా కన్ఫర్మేషన్ వచ్చేసింది. ప్రభాస్ సినిమా రాదని తెలిసిన తర్వాతే.. ఇండస్ట్రీలో ఇతర సినిమాల మార్పులు చేర్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 28 కోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది. అసలు ఈ రిలీజ్ డేట్స్ గోలేంటి..? సలార్ ప్లేస్‌ను ఏ సినిమా రీ ప్లేస్ చేయబోతుంది..?. తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ గందరగోళం నడుస్తుంది. ఏ సినిమా ఎప్పుడొస్తుందో ఎవరికీ క్లారిటీ లేదు. ఓ డేట్ అనౌన్స్ చేస్తున్నారు.. కానీ ఆ రోజు కాకుండా ఎప్పుడెప్పుడో వస్తున్నారు. ఒక్కటో రెండో కాదు.. చాలా సినిమాలకు ఇదే జరుగుతుంది. తాజాగా సలార్ వాయిదా పడిందనే విషయం తెలియగానే.. సెప్టెంబర్ 28పై ఖర్చీఫ్ వేసారు రామ్. ఈయన స్కంద సెప్టెంబర్ 15 నుంచి 28కి ఫిక్స్ అయింది.

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న స్కంద సెప్టెంబర్ 15న విడుదల చేయాలనుకున్నారు.. కానీ కొన్ని కారణాలతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28కి ఫిక్స్ చేసారు. అదే రోజు సితార ఎంటర్‌టైన్మెంట్స్ మ్యాడ్‌తో పాటు ఏఎం రత్నం నిర్మిస్తున్న రూల్స్ రంజన్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 29న శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న పెదకాపు 1 విడుదల కానుంది.

ఈ రిలీజ్ డేట్స్ కన్ఫ్యూజన్ చాలా సినిమాలకు ఉంది. చాలా రోజులుగా వాయిదాలు పడుతూ వస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఎట్టకేలకు సెప్టెంబర్ 7న వచ్చేస్తుంది. అలాగే సెప్టెంబర్ 15న రావాల్సిన డిజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ కూడా వాయిదా పడింది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే చెప్తామంటున్నారు మేకర్స్. టైగర్ నాగేశ్వరరావు కూడా దసరా బరి నుంచి తప్పుకునేలా కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.