SSMB28: మహేష్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. టైటిల్ అనౌన్స్ చేసేది అప్పుడే

|

Feb 23, 2023 | 4:37 PM

దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీ ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది

SSMB28: మహేష్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. టైటిల్ అనౌన్స్ చేసేది అప్పుడే
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీ ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోండగా.. కీలకపాత్రలో శ్రీలీల కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య అన్ని కమర్షియల్ హంగులున్న సినిమాగా తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఇదిలా ఉంటే ఈ సినిమానుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఉగాది పండగ పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నారట. ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేసేందుకు నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే మహేష్ విదేశాలనుంచి తిరిగి వచ్చి షూటింగ్ లో పాల్గొన్నాడు .

మరో వైపు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తికాక ముందే ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.  ప్రముఖ ఓటీటీ సంస్థ  నెట్ ఫ్లిక్స్ తెలుగు తమిళం కన్నడ మలయాళ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.