
సెలబ్రిటీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ చూసినా వారి ఫోటోలు, వీడియోలే. ముఖ్యంగా సినిమా స్టార్స్‌కి సంబంధించిన పిక్స్ అయితే ఐదేనా అకేషన్ ఉంటే చాలు.. తెగ వైరల్ చేస్తారు వారి అభిమానులు. ఆ రోజున వారి నేమ్ ట్రెండింగ్‌లో ఉండాల్సిందే. అందులో చైల్డ్‌హుడ్ ఫోటోలు ముందు వరసలో ఉంటాయి. అలానే ప్రజంట్ తెలుగు రాష్ట్రాల్లో మస్త్ ట్రెండింగ్‌లో ఉన్న ఓ క్రేజీ బ్యూటీకి సంబంధించిన చిన్నప్పటి ముద్దైన ఫోటో వైరలవుతుంది. తన మాటలతో మాయ చేస్తుంది ఈ క్యూటీ. పంచ్‌లతో నవ్వులు పూయిస్తుంది. షో తను హోస్ట్ చేసిందంటే కిర్రాక్ రెస్పాన్స్ వస్తుంది. అవును.. తను యాంకర్. ఆ బూరెబుగ్గలు చూస్తే అర్థం అవ్వట్లేదా..? తను ఎవరో..? ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారా..? ఇక మేమే చెప్పేస్తాం లేండి.
తను మన బుల్లితెర రాములమ్మ శ్రీముఖి. హుషారుకు కేరాఫ్ అడ్రస్. ఫస్ట్‌లో సినిమాల్లో చిన్న, చిన్న రోల్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు యాంకర్‌గా బుల్లితెరను ఏలేస్తుంది. అటు ఆడియో ఫంక్షన్స్‌లోనూ తన హోస్టింగ్‌తో కట్టి పడేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 పాల్గొని.. మరింత ఫేమస్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో తన అందచందాల ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రాళ్ల హృదయాలను ఏలేస్తుంది. ఇక రెమ్యూనరేషన్ విషయంలోనూ అమ్మడు రాక్ చేస్తుంది. ఒక్క రోజు కాల్షీట్‌కు 2 లక్షలు ఇవ్వాల్సిందేనట. కాగా ప్రజంట్ శ్రీముఖి చిన్నప్పటి ఫోటోను చూసిన నెటిజన్లు.. వావ్, సూపర్, క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.