MohanBabu : తాగి కొడతావా.. రా చూసుకుందాం..! మనోజ్‌కు మోహన్ బాబు మాస్ వార్నింగ్

|

Dec 10, 2024 | 9:28 PM

తాజాగా మనోజ్ తాజాగా జలపల్లి లోని మంచు టౌన్ కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. అనంతరం లోపలి వెళ్లిన మీడియా పై మోహన్ బాబు దాడి చేశారు. మనోజ్ గేట్లు తోసుకుంటూ.. మంచు టౌన్ లోకి వెళ్లారు.

MohanBabu : తాగి కొడతావా.. రా చూసుకుందాం..! మనోజ్‌కు మోహన్ బాబు మాస్ వార్నింగ్
Follow us on

మంచు ఫ్యామిలీ వ్యవహారం రచక్కెక్కింది. మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా మనోజ్ తాజాగా జలపల్లి లోని మంచు టౌన్ కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. అనంతరం లోపలి వెళ్లిన మీడియా పై మోహన్ బాబు దాడి చేశారు. మనోజ్ గేట్లు తోసుకుంటూ.. మంచు టౌన్ లోకి వెళ్లారు. మనోజ్ పై మోహన్ బాబు బౌన్సర్లు దాడి చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు వాయిస్ ఇప్పుడు బయటకు వచ్చింది. మనోజ్ కు వార్నింగ్ ఇస్తూ మోహన్ బాబు ఓ వాయిస్ ను విడుదల చేశారు.

ఈ వాయిస్ లో నా ముగ్గురి పిల్లల్లో నిన్నే నేను గారాబంగా పెంచుకున్నాను. నీ భార్య మాటలు విని చెడిపోయావ్.. మద్యానికి బానిస అయ్యావు. రోజూ తాగుతూ చెడిపోయావ్.. ఇంట్లో పనివాళ్ల పై దాడి చేస్తున్నావు. చిన్న వాళ్ళను ఎందుకు కొడుతున్నావు.  నా విద్య సంస్థల పై ఎందుకు పడ్డావు.? అందరిని కొట్టడానికి వస్తున్నావ్.? మీ అన్నను కొట్టడానికి వస్తావా.? మీ అన్నాను చంపాలని చూస్తావా.? రా నేను చూసుకుంటా.? తాకి చూడు.

నువ్వు నా పరువు తీశావు. నా ఇంట్లోకి అడుగుపెట్టే అర్హత లేదు. ఇది నా డబ్బు, నా కష్టార్జితం. ఆస్తులు ఇస్తానా .? లేక ఎవరికైనా దానం చేస్తానా అన్నది నా ఇష్టం. మద్యం తాగి నేను ఎవరిని కొట్టలేదు. నేను ప్రజలకు అన్యాయం చేయలేదు. మీ అమ్మ నీ వల్ల హాస్పటల్ లో చేరింది రా.. నేను మీ అమ్మ ఏడుస్తున్నాం రా.. నా ఇంట్లోకి చొరబడి, నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి అడుగుపెట్టలేవు.. నామీద పోలీసులకు ఫిర్యాదు చేశావ్.. రేపో ఎల్లుండో మీ అమ్మను పిలిపించి.. నీ బిడ్డను తీసుకొచ్చి నీకు అప్పగిస్తుంది.

మోహన్ బాబు ఆడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.