Mohan Babu: సీరియస్ లుక్‌లో మోహన్ బాబు.. ‘సన్నాఫ్ ఇండియా’ ఫస్ట్‌లుక్ రిలీజ్

|

Jan 29, 2021 | 12:49 PM

టాలీవుడ్ సినీయర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహ‌న్‌ బాబు క‌థానాయ‌కుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. ఈ చిత్రానికి డైమండ్ ర‌తన్ బాబు ద‌ర్శకత్వం వ‌హిస్తుండగా..

Mohan Babu: సీరియస్ లుక్‌లో మోహన్ బాబు.. ‘సన్నాఫ్ ఇండియా’ ఫస్ట్‌లుక్ రిలీజ్
Follow us on

Son of India Movie: టాలీవుడ్ సినీయర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహ‌న్‌ బాబు క‌థానాయ‌కుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. ఈ చిత్రానికి డైమండ్ ర‌తన్ బాబు ద‌ర్శకత్వం వ‌హిస్తుండగా.. శ్రీ ల‌క్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవలనే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్‌ను ప్రకటించారు మూవీమేకర్స్. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి మోహన్ బాబు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘దేశభక్తి అతడి రక్తంలోనే ఉంది.. సన్నాఫ్‌ ఇండియాను కలుసుకోండి’ అంటూ ట్విట్ చేశారు. ఇందులో ఆయన సీరియస్‌ లుక్‌లో.. మెడలో రుద్రాక్ష మాలతో పోరాడే నాయకుడిగా కనిపించారు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇదిలాఉంటే మోహన్ బాబు చివరిసారి ‘గాయత్రి’ సినిమాలో హీరోగా నటించారు. ఆ తరువాత ‘మహానటి’ సినిమాలో ఎస్వీఆర్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

 

Also Read:

45 ఏళ్లుగా సినిమానే శ్వాసగా, అరుదైన మైలురాయి అందుకున్న మోహన్ బాబు