డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంది. యువతును ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. సిద్దూ ఒన్ మాన్ షోగా ఈ సినిమాను నడిపించాడు. తెలంగాణ స్లాంగ్ లో సిద్దూ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి ఈ సినిమాలో డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ డైలాగ్స్ ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా మీమ్స్ కు డీజే టిల్లు డైలాగ్స్ ను ఎక్కువగా వాడుతుంటారు మీమర్స్. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరాల్ గా మారింది. మీమర్స్ క్రియేటివిటీ మాములుగా ఉండదు.
ఇప్పుడు ఎక్కడ చూసిన ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ వాడకం ఎక్కువైపోయింది. ఈ మధ్య ఏఐనువాడి వాయిస్ లను కూడా చేంజ్ చేస్తున్నారు. ప్రముఖుల వాయిస్ తో కొన్ని సాంగ్స్ ను చేంజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబుకు సంబందించిన ఓ వీడియో వైరల్ గా మారింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో మహేష్ బాబు డీజే టిల్లు గా మారాడు.
డీజే టిల్లు సినిమాలో సిద్దూ రాధికా అపార్ట్ మెంట్ కు వెళ్లే సీన్ ను మహేష్ బాబుతో ఎడిట్ చేశారు. సిద్దూ ముఖానికి బదులు మహేష్ బాబు ఫేస్ ను ఎడిట్ చేసి అలాగే ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మహేష్ బాబు వాయిస్ ను కూడా సెట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అటు సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.