జాలువారుతున్న జలపాతం.. పక్కనే అందమైన ఇంద్రధనస్సు.. అక్కడే హొయలు పోతున్న ఎర్రని ముద్దమందారం.. పైన పేర్కొన్న ఫోటో చూస్తుంటే.. మీకు కూడా అదే అనిపిస్తోంది కదూ.. ఆమె ఓ టాలీవుడ్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే. కాని ఆమె అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. యువ హీరోలతో కలిసి ఆడిపాడింది. నాని ‘కృష్ణగాడి వీరప్రేమ గాధ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ.. తాజాగా ‘ఎఫ్3- ఫన్ అండ్ ఫ్రస్టేషన్’తో హిట్ కొట్టింది. ఈపాటికి ఆమెవరో మీకే అర్ధమై ఉంటుంది.
ఆమెవరో కాదు మెహ్రీన్ పిర్జాదా. 2016లో ;కృష్ణగాడి వీర ప్రేమగాధ’ చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్.. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ లాంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. వీటి తర్వాత మెహ్రీన్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా సక్సెస్ కానప్పటికీ.. ఆమెకు మాత్రం నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇక ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ సినిమాలతో మెహ్రీన్‌కు సూపర్ హిట్స్ దక్కించుకుంది. కాగా, ఈ బ్యూటీ ప్రస్తుతం ‘స్పార్క్’, ‘నీ సిగూవరేగు’ అనే సినిమాల్లో నటిస్తోంది.