Chiranjeevi Surprise Gift To DSP: లాక్‌డౌన్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు మళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. దీంతో వరుస పెట్టి సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే ‘ఉప్పెన’ సినిమా. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ చిత్రం సంచలన విజయ సాధించింది. ఏకంగా రూ.70 ఓట్ల గ్రాస్ వసూళు చేసి రికార్డులు తిరగరాసే పనిలో పడింది.
ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. ఈ సినిమాకు దేవీశ్రీ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ఈక్రమంలోనే దేవీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా మెగా స్టార్ చిరంజీవి కూడా దేవీ శ్రీ ప్రసాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఓ బహుమతిని కూడా పంపించాడు. బహుమతితో పాటు చిరు ఓ లేఖను పంపాడు. ఆ లేఖలో ఏముందంటే.. `డియర్ డీఎస్పీ.. ఎగసిపడిన ఈ `ఉప్పెన` విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతం ఇస్తావో.. కొత్త వారికి కూడా అంతే ఫ్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావు. నీలో ఉండే ఈ ఎనర్జీ, సినిమాలకు నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేమతో చిరంజీవి` అంటూ చిరు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇక తన అభిమాన హీరో నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్ రావడంతో దేవీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్న దేవీశ్రీ.. ఓ వీడియోను రూపొందించాడు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘చిరు సార్ నుంచి అపురూపమైన బహుమతి అందుకున్నాను. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నాకు ట్వీట్ సరిపోదు.. అందుకే వీడియోను రూపొందించాను’ అంటూ క్యాప్షన్ జోడించాడు.
OMG ! ?
This MEGA GIFT & LETTER frm 1 & Only MEGASTAR Dearest @KChiruTweets Sir made my DAY & YEAR?❤️???I made a Video 2 share it with U all coz a Tweet cant do Justice??
Lov U Chiru Sir..Always ❤️???@MythriOfficial #Uppena https://t.co/Tn7CqQ16QM
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 21, 2021