Chiranjeevi- Nani: శ్యామ్ సింగరాయ్ తో కలిసి మీసం మెలేసిన మెగాస్టార్.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఫొటో..

| Edited By: Ravi Kiran

Jan 21, 2022 | 6:48 AM

నేచురల్ స్టార్ నాని హీరోగా ట్యాక్సీవాలా  ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన లో తెరకెక్కిన చిత్రం ' శ్యామ్ సింగరాయ్'.  నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా

Chiranjeevi- Nani: శ్యామ్ సింగరాయ్ తో కలిసి మీసం మెలేసిన మెగాస్టార్.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఫొటో..
Follow us on

నేచురల్ స్టార్ నాని హీరోగా ట్యాక్సీవాలా  ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన లో తెరకెక్కిన చిత్రం ‘ శ్యామ్ సింగరాయ్’.  నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు.  గతేడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.  అన్ని చోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది.  పలువురు ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నాని సినిమాను వీక్షించారు. శ్యామ్ సింగరాయ్ చిత్ర బృందాన్ని అభినందించారు.

శ్యామ్ ఎవరికి నచ్చాడో తెలుసా?

కాగా దీనికి సంబంధించి నాని, చిరంజీవితో ఓ ఫోటోను పంచుకుంటూ  ఈ ‘శ్యామ్’ ఎవరికి నచ్చాడో కనిపెట్టండి? అంటూ ట్వీట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపటికే మెగాస్టార్ తో కలిసి దిగిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు.ఇందులో మెగాస్టార్, నేచురల్ స్టార్ ఇద్దరూ మీసం మెలేస్తూ కనిపించారు. ఈ ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా థియేటర్లలో సందడి చేస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ నేటి(జనవరి 21 ) నుంచి డిజిటల్ మాధ్యమంలో ప్రేక్షకులకు అందుబాటులోకి  వచ్చింది. ప్రముఖ ఓటీటీ  నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: Coronavirus: మొన్న తండ్రి.. నేడు కుమారుడు.. కరోనా బారిన పడ్డ స్టార్ హీరో..

TOP 9 ET News : నీ సాయం మరువలేనిది.. | కోరిక తీరిస్తేనే సినిమా అవకాశం..(వీడియో)

TV9 Digital News Round Up : అప్సరరాణి నోట క్యాస్టింగ్‌కౌచ్‌ మాట | కోళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు..( వీడియో)