
డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన బేబి సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ సినీ ప్రియులను అంచనాలను దాటుకుంటూ భారీ విజయాన్ని అందుకుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ బేబి చిత్రయూనిట్ ను పొగడ్తలతో ముంచేత్తారు. ఇటీవలే ఈ సినిమా మెగా సక్సెస్ సెలబ్రెషన్స్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి మూవీ టీంకు అభినందనలు తెలియజేశారు. అయితే ఈ వేడుకలలో చిరు చేతికి ఉన్న వాచ్ చాలా మందిని ఆకర్షించింది. దీంతో ఆ వాచ్ వివరాలు తెలుసుకోవడానికి సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్.
నివేదికల ప్రకారం.. చిరు చేతికి పెట్టుకున్న రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ ధర 230,000 డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.90 కోట్లు. ఈ సంపన్నమైన టైమ్ పీస్ ప్రతిష్ట, గొప్పతనానికి నిజమైన చిహ్నం. ఈ వాచ్ డిజైన్ చాలా సున్నితంగా..ఎంతో అట్రాక్షన్ గా కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కీర్తి ప్రియుడిగా సుశాంత్ కనిపించనున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.