Megastar Chiranjeevi: ఒక్క హీరోయిన్‏తోనే 4 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన చిరంజీవి.. ఇద్దరి కాంబోలో 19 సినిమాలు.. ఎవరంటే..

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో విజయాన్ని అందుకున్న చిరు... విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చిరు సినిమాల గురించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతుంది.

Megastar Chiranjeevi: ఒక్క హీరోయిన్‏తోనే 4 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన చిరంజీవి.. ఇద్దరి కాంబోలో 19 సినిమాలు.. ఎవరంటే..
Chiranjeevi

Updated on: May 28, 2025 | 12:33 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చిరు జోడిగా మరోసారి నయనతార కనిపించనుంది. ఇదిలా ఉంటే.. చిరు కెరీర్ లో రాధిక, రాధా, విజయశాంతి, సుహాసిని, శ్రీదేవి, మీనా, రమ్యకృష్ణ, సౌందర్య వంటి ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. కానీ ఎక్కువగా రాధా, రాధిక, విజయశాంతి వంటి సీనియర్ హీరోయిన్స్ చిరుతో ఎక్కువ సినిమాలు చేశారు. అయితే కేవలం ఒక్క హీరోయిన్ తో మాత్రమే చిరు నాలుగు సార్లు బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టారని తెలుసా..? వీరిద్దరి జోడికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ విజయశాంతి. వీరిద్దరి కాంబోలో మొదటిసారి 1983లో సంఘర్షణ అనే సినిమా వచ్చింది. ఎలాంటి ఇంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పదేళ్లల్లో వీరిద్దరి నుంచి ఏకంగా 19 సినిమాలు వచ్చాయి. విజయశాంతి తర్వాత చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ రాధ. వీరి జోడికి సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. రాధ, చిరు కాంబోలో 16 సినిమాలు వచ్చాయి. చిరంజీవి, విజయశాంతి కలిసి చివరిసారిగా మెకానిక్ అల్లుడు చిత్రంలో కనిపించారు. ఈ సినిమా 1993లో విడుదలైంది.

చిరంజీవి, విజయశాంతి కాంబోలో వచ్చిన పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అలాగే వీరిద్దరు కలిసి నటించిన స్వయం కృషి సినిమా సైతం విజయం సాధించింది. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ పెయిర్ అంటే చిరు, విజయశాంతి మాత్రమే. ఇప్పటికీ ఇద్దరూ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రంలో నటించారు.

Chiranjeevi, Vijayashanthi

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..