Megastar Chiranjeevi: ముఠామేస్త్రిని గుర్తుచేసిన మెగాస్టార్ 154 పోస్టర్.. బాస్ మాస్ లుక్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు ఆశపడుతుంటారు. ఆయన ఒక్క సినిమా అయినా చేయాలనీ కుర్ర దర్శకులు ఎన్నో కలలు కంటుంటారు.

Megastar Chiranjeevi: ముఠామేస్త్రిని గుర్తుచేసిన మెగాస్టార్ 154 పోస్టర్.. బాస్ మాస్ లుక్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..
Megastar

Edited By: Anil kumar poka

Updated on: Aug 23, 2021 | 8:03 AM

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు ఆశపడుతుంటారు. ఆయన ఒక్క సినిమా అయినా చేయాలనీ కుర్ర దర్శకులు ఎన్నో కలలు కంటుంటారు. కొంతమంది చిరు కోసం కథలు కూడా సిద్ధం చేసి ఆయనను మెప్పించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ ఇంప్రెస్ అయ్యే ఆ కథతో ఆయన దగ్గరకు వెళ్లి సినిమా ఓకే చేయించుకున్నాడు దర్శకుడు బాబీ. మెగాస్టార్ ఫ్యాన్ అయిన బాబీ ఆయనతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చిరంజీవి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విధితమే. అందులో బాబీ సినిమా కూడా ఒకటి. అయితే ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేశారు ఆయా చిత్రయూనిట్ . అందులో భాగంగా ఆచార్య నుంచి మేకింగ్ వీడియో విడుదల అవ్వగా..మెహర్ రమేష్ చేస్తున్న సినిమా నుంచి టైటిల్ విడుదల చేశారు. ఈ సినిమాకు భోళా శంకర్ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక లూసిఫర్ రీమేక్ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిన్‌ను కన్ఫామ్ చేశారు. ఈ క్రమంలోనే బాబీ సినిమా నుంచి కూడా ఓ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా నుంచి ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ సముద్ర నేపథ్యంలో పూర్తి మాస్ స్టోరీతో తెరకెక్కనుందని తాజాగా రివీల్ చేసిన పోస్టర్ తెలుపుతుంది. ఎర్ర టవల్ తలకు చుట్టుకొని.. లుంగీ కట్టుకొని.. బీడీ తాగుతూ.. లంగర్‌ను చేత్తో పట్టుకొని పడవ పై నిలుచొని ఊర మాస్‌గా కనిపించరు మెగాస్టార్. ఈ పోస్టర్ చూస్తుంటే ముఠామేస్త్రి సినిమాలో చిరుల కనిపిస్తున్నారు ఆయన. ఇక మెగాస్టార్ కోసం బాబీ ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశాడని తెలుస్తుంది. ఆలాగే ఈ మూవీ  భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మెగాస్టార్ 154కి చిరంజీవికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi: మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్.. బర్త్ డే వేళ 24 విభాగాల్లోని సినీ కార్మికులకు స్వీట్ న్యూస్

లడఖ్‌లో మొట్టమొదటి ‘రోవింగ్’ థియేటర్‌ ఏర్పాటు.. ఇందులో ఓ జాతి చరిత్రను తొలిసారి ప్రదర్శించారు..

MLA Roja: మహాబలిపురం రిసార్ట్‌లో రాఖీ వేడుకలు జరుపుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. చిత్రాలు