క్యాన్సర్.. ఎంత పెద్ద మహమ్మారి అనేది అందరికీ తెల్సు. ఎన్నో ప్రాణాలను మింగేస్తుంది ఈ వ్యాధి. అయితే ముందుగానే గుర్తిస్తే.. క్యాన్సర్ నుంచి ఈజీగానే బయటపడొచ్చు. కానీ చాలామంది ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నప్పుడే క్యాన్సర్ బారిన పడినట్లు తెలుసుకుంటారు. ర్యాండమ్‌గా టెస్టులు, స్క్రీనింగ్ చేయించుకోకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే తాజాగా నానక్‌రామ్‌గూడాలోని స్టార్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు.. ఎంతోమంది పేదవారు తన అభిమానుల్లో, సినీ కార్మిక వర్గాల్లో ఉన్నారని.. వారందరికీ టెస్టులు, స్క్రీనింగ్ చేయించుకునేందుకు తాను ముందుకు వస్తానని అనౌన్స్ చేశారు. ఇది తన అభిమానులకు తానిచ్చే ఓ గిఫ్ట్ అన్నారు. జిల్లాలవారీగా ఇలాంటి కార్యక్రమాలు పెడితే ఎన్ని కోట్లు అయినా తాను భరిస్తానని మెగాస్టార్ చెప్పారు. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లోనూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అందుకు స్టార్ ఆస్పత్రి వర్గాలు కూడా ముందుకు వచ్చాయి. ఆదేశం మీది.. ఆచరణ మాది అంటూ.. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని వారు చిరుకు తెలిపారు.
ఇదే కార్యక్రమంలో ముందు జాగ్రత్తగా టెస్టులు చేయించుకోవడం ఎంత అవసరమో చిరంజీవి తెలిపారు. “నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎప్పుడైనా ఫ్రెండ్స్‌తో వైన్ తీసుకుంటా. వర్కువుట్స్ చేస్తా, మంచి డైట్ ఫాలో అవుతా. నాకంటూ స్పెషల్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు. కాబట్టి, నాకు ఆరోగ్య సమస్యలు రావనే భావనతో ఉండేవాడిని. ఒక వయసు దాటిన తర్వాత కొలన్ క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉందని, ముందస్తు అవగాహనతో కొలనో స్కోపీ చేయించా. non – cancerous టిష్యులు ఉన్నట్లు వైద్యులు గుర్తించి.. తొలగించారు” అని చిరంజీవి తెలిపారు.
అయితే కేవలం టిష్యులు ఉన్నాయని తాను చెబితే.. క్యాన్సర్ వచ్చినట్లు కొందరు రాయడం పట్ల చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని అర్థం చేసుకోకుండా రాయడం వల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారని పేర్కొన్నారు.
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.