దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు 80 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలలో సత్తా చాటింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అట్టహాసంగా ప్రారంభమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ బెస్ట్.. నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ కేటగీరిల్లో ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ అవార్డ్ గెలుచుకుంది. మొట్ట మొదటిసారిగా భారతీయ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచి చరిత్ర సృష్టించగా.. ఈ అవార్డును ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక పురస్కారం గోల్డెన్ గ్లోబ్ అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
“ఇదొక చారితక్రక విజయం..అద్భుతమైనది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకి గానూ కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి నా అభినందనలు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. సంగీతం, డ్యాన్స్ ఈ రెండింటి సెలబ్రెషనే నాటు నాటు . మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈరోజు మీతో కలిసి డ్యాన్స్ చేస్తోంది. చరణ్, తారక్ తోపాటు.. అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్, ఉర్రూతలూగించేలా ఆలపించిన రాహుల్… కాలబైరవ, కొరియోగ్రాఫర్ ఫ్రేమ్ రక్షిత్ కు కంగ్రాట్స్” అంటూ ట్వీట్ చేశారు చిరు.
What a Phenomenal, Historic Achievement !!!! ????
Golden Globes Best Original Song – Motion Picture Award to @mmkeeravaani garu !! Take a Bow!?
Heartiest Congratulations Team @RRRMovie & @ssrajamouli !!
India is proud of you! ?? #NaatuNaatu ?? pic.twitter.com/gl7QjMkJtZ— Chiranjeevi Konidela (@KChiruTweets) January 11, 2023
అలాగే.. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. తెలుగు సంగీత కీర్తి పతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడిస్తూ, ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ దక్కించుకోవడం పట్ల చిత్ర సంగీత దర్శకుడు శ్రీ ఎంఎం కీరవాణి, చిత్ర దర్శకుడు శ్రీ రాజమౌళి, నటులు శ్రీ రామ్ చరణ్, శ్రీ జూనియన్ ఎన్టీఆర్ తోపాటుగా యావత్ చిత్ర యూనిట్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈ అవార్డు భారతీయ సంగీతానికి, మరీ ప్రత్యేకంగా మన తెలుగు పాటకు దక్కిన అద్భుతమైన గౌరవం. తెలుగు చిత్రాలు ఇప్పటికే అంతర్జాతీయంగా బాక్సాఫీస్ కలెక్షన్లలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకుంటున్న సందర్భంలో మన పాటకు కూడా అంతర్జాతీయ గౌరవ దక్కడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. రానున్న రోజుల్లో మన సంగీతం (మ్యూజిక్), మన నృత్యం (కొరియోగ్రఫీ), మన దర్శకత్వం (డైరెక్షన్), మన చిత్రాలు అంతర్జాతీయంగా మరింత గుర్తింపును అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.