Acharya : శరవేగంగా ఆచార్య షూటింగ్.. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సినిమా.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్..

|

Aug 04, 2021 | 7:13 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Acharya : శరవేగంగా ఆచార్య షూటింగ్.. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సినిమా.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్..
Follow us on

Acharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్నపాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆచార్య సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరుకి జోడీగాకాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజాహెగ్డే కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాట సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమాలో చిరు- చరణ్ ఇద్దిరూ నక్సలైట్‌‌‌‌లుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్‌‌‌లో ఉంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆచార్య సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. మొదట్లో హీరోయిన్ కష్టాలు వెంటాడితే.. ఆ తర్వాత కరోనా ఫస్ట్ వేవ్ కొత్తకష్టాన్ని తెచ్చిపెట్టింది. కరోనా తర్వాత పరిస్థితులు కుదుటపడుతున్నాయి అనుకునేలోగా వర్షాలకు సెట్ దెబ్బ తినడం.. ఈ లోపు కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చి పడటం.. ఇలా అనేక అడ్డంకుల కారణంగా ఆచార్య ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ ను పూర్తి చేసింది. మరో రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రెండు పాటల షూటింగ్ కూడా శరవేగంగా జరపనున్నారని తెలుస్తుంది. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ అదిరిపోయే పోస్టర్‌‌‌‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌‌‌లో నక్సల్ గెటప్ లో చిరు- చరణ్ కనిపించారు. చరణ్ కూర్చొని ఉండగా ఆ పక్కన మెగాస్టార్ చరణ్ పైన చేయివేసి కూర్చున్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shilpa Shetty: దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!

Virat Kohli : అనుష్క శర్మ‌ను తొలిసారి కలిసినప్పుడు కోహ్లీ ఫీలింగ్స్ ఏంటి?.. ఆసక్తికర విషయాలు తెలిపిన కెప్టెన్

Rakshasudu2: భారీ బడ్జెట్‌‌‌‌తో తెరకెక్కుతున్న రాక్షసుడు2.. సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలు.?

Actor Murali Mohan: సినీనటుడు మురళీమోహన్.. అతని కుటుంబ సభ్యులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్