Sai Dharam Tej: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెద్ద ప్రమాదం నుంచి బయట పడిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ సినిమా సమయంలో తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది.

Sai Dharam Tej: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..
Sai Dharam Tej

Updated on: Feb 21, 2022 | 5:37 PM

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెద్ద ప్రమాదం నుంచి బయట పడిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ సినిమా సమయంలో తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. తేజ్ కు యాక్సిడెంట్ జరిగిందని తెలిసి మెగా ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందారు. కొద్ది నెలల క్రితం సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై కెబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజుకు తీవ్ర గాయాలు కావడంతో.. సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లి హిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత దీపావళి పండగ రోజున తేజ్ పూర్తిగా కోలుకున్నడంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఇప్పుడు తేజ్ పూర్తిగా కోలుకున్నాడు.

కోలుకున్న తర్వాత మొదటిసారిగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ని కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్. ఆలయ మర్యాదపూర్వకంగా  తేజ్ కుటుంబానికి అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు ప్రసాదం అందజేససారు అర్చకులు. ఏప్పుడు విజయవాడ వచ్చినా తప్పకుండా దుర్గమును దర్శించుకుంటానని..చాలా ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగిందని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. ఇక త్వరలోనే తేజ్ తన కొత్త సినిమాను ప్రారంభించనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

గులాబీ పువ్వుల విరబూసిన ఆమ్నా షరీఫ్ అందాలు.. ఫోటోలు చుస్తే మతిపోవాల్సిందే.

తన అందాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న బిగ్ బాస్ విన్నర్ తేజస్వి ప్రకాష్ లేటెస్ట్ ఫోటోస్.

Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్..

Follow Us