
Nagababu Jabardasth : మళ్ళీ జబర్దస్త్ షోకి నాగబాబు రీ ఎంట్రీ అంటూ టాక్ వినిపిస్తుంది. తాజాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలతో.. మెగాబ్రదర్ మళ్ళీ మళ్లీ సొంత గూటికి వస్తాడనే ప్రచారం జోరందుకుంది. సినీ నిర్మాతగా నష్టపోయిన తనను ఆదుకుంది బుల్లితెర అని.. మెగా బ్రదర్ నాగబాబు అనేక ఫంక్షన్లలో చెప్పాడు.. ఇక ముఖ్యంగా జబర్దస్త్ షో కి జడ్జి గా నవ్వులు పూయిస్తూ నాగబాబు అంటే జబర్దస్త్ … జబర్దస్త్ అంటే నాగబాబు అన్న రీతిలో పేరు తెచ్చుకున్నాడు. తమకు నాగబాబు జడ్జి మాత్రమే కాదని.. తమకు అన్నగా అండగా ఉంటూ.. ఆర్ధిక విషయాల్లో అనేక సలహాలు ఇస్తూ.. తమ ఎదుగుదలకు కారణమయ్యారని చమ్మక చంద్ర, ఆర్ఫీ, గెటప్ శ్రీను వంటి వారు పలు సందర్భాల్లో చెప్పారు.. అయితే మెగాబ్రదర్ జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నాడు.. అప్పటి నుంచి ఆ షో కళ తప్పింది. నాగబాబు ప్లేస్ లో ఎంతమంది జడ్జీలు వచ్చి వెళుతున్నా ఆ లోటు అలాగే కనిపిస్తుంది. నాగబాబు ఈ షోని వదిలిన ఈ 9 నెలల్లో నరేష్, పోసాని తరుణ్ భాస్కర్ వంటి వారు జడ్జీలుగా వచ్చారు.. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయారు. అయితే నాగబాబు ప్లేస్ లో మనోని తీసుకొచ్చారు.
ఇక నాగబాబు అదిరింది షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.. వేణుతో పాటు ధనరాజ్, చమ్మక్ చంద్ర లాంటి టీమ్స్ చాలా మంది ఉన్నా కూడా ఎందుకో అదిరింది షో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకోలేక పోయింది. దీంతో ఆ షోను హఠాత్తుగా నిలిపేశారు. ఇక నాగబాబు కూడా అక్కడ్నుంచి బయటపడాలని నాగబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. నాగబాబు ఎక్కడికి వస్తాడనేది ఆసక్తికరంగా మారుతున్న సమయంలో ఆ మధ్య జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను… నాగబాబు గురించి అడిగినపుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడం అనేది పూర్తిగా నాగబాబు పర్సనల్ అని.. ఆయన లేని లోటు కనిపిస్తుందన్నాడు శ్రీను. అంతే కాదు జబర్దస్త్ షోలోకి మళ్లీ నాగబాబు రావచ్చు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆయన వస్తే బాగుంటుందని.. రావాలనే తామంతా కోరుకుంటున్నామంటూ ఆసక్తి రేపాడు. నాగబాబు మళ్ళీ జబర్దస్త్ కి జడ్జిగా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పాడు. అయితే ఎప్పుడు అనేది మాత్రం రివీల్ చేయలేదు.
గెటప్ శ్రీను వ్యాఖ్యలతో నాగబాబు ని నమ్ముకుని జబర్దస్త్ షో నుంచి వెళ్ళిపోయిన చంద్ర ఆర్పీ వంటి కమెడియన్ల పరిస్థితి ఏమిటి అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అసలు గెటప్ శ్రీను ఇచ్చిన హింట్ నిజమేనా..? మళ్ళీ పాపులర్ కామెడీ షో లో మెగాబ్రదర్ మళ్ళీ అడుగు పెట్టి తన నవ్వుతో మళ్ళీ అందరినీ అలరిస్తాడా వంటి ప్రశ్నలకు సాధనం కోసం వేచి చూడాల్సిందే మరి
Also Read: ‘జబర్దస్త్’లో మరో లవ్ ట్రాక్ మొదలైంది, ఇమ్మానుయేల్, వర్ష మధ్య సమ్‌థింగ్..సమ్‌థింగ్