Megastar Chiranjeevi: హైటెక్స్ లో చిరు బర్త్ డే వేడుకలు.. మెగా హీరోలు హాజరు.. ఓ సీక్రెట్ ని షేర్ చేస్తానన్న మెగాబ్రదర్

చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ హాజరుకానున్నారని.. మా ఫ్యామిలీ హీరోలతో పాటు.. ఇతర హీరోలు హాజరుకానున్నారని నాగబాబు చెప్పారు. అంతేకాదు.. చిరంజీవిని అభిమానించే సినీ పరిశ్రమకు చెందిన ఇతరులు కూడా వస్తారని పేర్కొన్నారు.

Megastar Chiranjeevi: హైటెక్స్ లో చిరు బర్త్ డే వేడుకలు.. మెగా హీరోలు హాజరు.. ఓ సీక్రెట్ ని షేర్ చేస్తానన్న మెగాబ్రదర్
Mega Brother Nagababu
Follow us

|

Updated on: Aug 18, 2022 | 2:51 PM

Megastar Chiranjeevi:  మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు రానున్న సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ వేదికగా జరగనున్నాయని చెప్పారు. చిరు పుట్టిన వేడుకల సందర్భంగా ప్రతి ఒక్క చిరు అభిమానులు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ హాజరుకానున్నారని.. మా ఫ్యామిలీతో పాటు.. ఇతర హీరోలు హాజరుకానున్నారని చెప్పారు. అంతేకాదు.. చిరంజీవిని అభిమానించే సినీ పరిశ్రమకు చెందిన ఇతరులు కూడా వస్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ జరగని విధంగా వెరీ వెరీ స్పెషల్ గా ఉండనున్నాయని చెప్పారు, అభిమానులకు స్పెషల్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వేడుకల్లో పాల్గొనే అభిమానులకు పాస్ లను రేపటి నుంచి బ్లడ్ బ్యాంక్, అభిమాన సంఘాల వద్ద అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు.

చిరంజీవి పుట్టిన రోజు ఎంతో మంది యూత్ మొదలు పెట్టారు. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు డిఫరెంట్ గా ఉండాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా డిఫరెంట్ గా కాన్సెప్ట్ ను డిజైన్ చేశారు. చిరంజీవి పుట్టిన రోజు వేడుకల కోసం వచ్చే అభిమానులను అలరించే విధంగా ఈవెంట్స్ ఉండనున్నాయని చెప్పారు. మాస్ భాషలో చెప్పాలంటే.. ఈ ఏడాది చిరంజీవి పుట్టిన రోజువేడుకలను ఒక జాతరలా జరపనున్నారని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఫెస్టివల్ ఒక కార్నివాల్ లా ఉండాలని.. భావించి డిజైన్ చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

చిన్నతనం నుంచి మా అన్నయ్య పుట్టిన రోజు చాలా గ్రాండ్ గా జరిగేదని.. వేడుకల సందర్భంగా తాను చిరంజీవి గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ ను చెప్పనున్నాని పేర్కొన్నారు నాగబాబు. మీడియా వారికీ కూడా ఆహ్వానం పలికారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..