Bangaram: ఇదేందయ్యా!! బుర్రపాడైందిగా.. బంగారం సినిమా హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి..!!

ఆయన నటించిన సినిమాల్లో పాటలకు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవర్ స్టార్ నటించిన సినిమాల్లో బంగారం సినిమా ఒకటి.

Bangaram: ఇదేందయ్యా!! బుర్రపాడైందిగా.. బంగారం సినిమా హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి..!!
Bangaram

Updated on: Jun 18, 2023 | 1:02 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆయన నటించిన సినిమాల్లో పాటలకు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవర్ స్టార్ నటించిన సినిమాల్లో బంగారం సినిమా ఒకటి.  2006లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాకు ధరణి దర్శకత్వం వహించారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాలో పవన్ నటన, ఆయన యాటిట్యూడ్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విద్యాసాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జర్నలిస్టు  పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీరాచోప్రా నటించారు.

మీరా చోప్రా బంగారం సినిమాతోనే తెలుగులోకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వాన అనే సినిమాలో నటించింది. ఈ  అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా బంధువు. ఇక మీరాచోప్రా తెలుగు, తమిళ్ తో పాటు పలు హిందీ సినిమాల్లో నటించింది.

2018లో నాస్తిక్ అనే హిందీ సినిమాలో నటిచింది. ఆతర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. దాదాపు 30 సినిమాల్లో నటించిన మీరా ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. కానీ ఈ భామ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తాజాగా మీరా చోప్రా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చూస్తే మీరు కూడా షాక్ అవుతారు.