Heroines: అంచనాలను పెంచేస్తోన్న ముద్దుగుమ్మలు.. మహేష్ మూవీ పై ఈ బ్యూటీ.. పవన్ సినిమా పై ఆ భామ

| Edited By: Rajeev Rayala

Jul 19, 2023 | 9:21 AM

గుంటూరు కారం సినిమాకు సంబంధించి కీ అప్‌డేట్‌ లీక్‌ చేశారు హీరోయిన్‌ మీనాక్షి చౌదరి. మహేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరక్షన్‌లో తెరకెక్కుతోంది గుంటూరు కారం.

Heroines: అంచనాలను పెంచేస్తోన్న ముద్దుగుమ్మలు.. మహేష్ మూవీ పై ఈ బ్యూటీ.. పవన్ సినిమా పై ఆ భామ
Mahesh Babu
Follow us on

సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు చాలా పాపులర్‌. మేడమ్‌ మీరు సూపర్‌ అంటూ వాళ్లని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఫ్యాన్స్. వాళ్లు అంతగా సంబరపడిపోవడానికి రీజన్‌ ఏంటని అనుకుంటున్నారా? పవన్‌ అండ్‌ మహేష్‌. యస్‌… ఈ బ్యూటీస్‌ ఇచ్చిన అప్‌డేట్స్ తో ఈ ఇద్దరు హీరోల సినిమాల స్టేటస్‌ మీద హింట్‌ అందింది ఫ్యాన్స్ కి. గుంటూరు కారం సినిమాకు సంబంధించి కీ అప్‌డేట్‌ లీక్‌ చేశారు హీరోయిన్‌ మీనాక్షి చౌదరి. మహేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరక్షన్‌లో తెరకెక్కుతోంది గుంటూరు కారం. ఈ సినిమాలో మీనాక్షి ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పూజా హెగ్డే మూవీ నుంచి బయటకు రావడంతో ఆ ప్లేస్‌ని రీప్లేస్‌ చేశారు మీనాక్షి.

ఆల్రెడీ తనకు సంబంధించి ఓ షెడ్యూల్‌ కూడా పూర్తయిందని ఆమె చెప్పిన మాటలను వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్‌ అంటే తనకు చాలా ఇష్టమని, గుంటూరు కారంలో ఫస్ట్ షాట్‌ మహేష్‌తోనే చేశానని అన్నారు మీనాక్షి. గుంటూరు కారం మరో రేంజ్‌ మూవీ అవుతుందని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా హరిహరవీరమల్లు. పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్‌ హరిహర వీరమల్లును అసలు ఫినిష్‌ చేస్తారా? లేదా? చేసినా, అది రిలీజ్‌ అయ్యే సమయానికి ఎన్నికలకు శుభం కార్డు పడాల్సిందేనా అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే టైమ్‌లో నిధి అగర్వాల్‌ పెట్టిన ఓ పోస్టు ఫ్యాన్స్ లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది.

హరిహరవీరమల్లులో పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటిస్తున్నారు నిధి. ఇటీవల పవన్‌ ఇన్‌స్టా పోస్టులో ఆమెతో తీసుకున్న ఫొటో కూడా ఉంది. దాన్ని షేర్‌ చేశారు నిధి. ఇలాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. నన్ను నమ్మండి. మీరు త్వరలోనే థియేటర్లో అద్భుతాన్ని చూస్తారు అని రాశారు నిధి. ఆమె మాటలకు ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్.