
ప్రస్తుతం ఓటీటీలో ఓ మర్డర్ మిస్టరీ సినిమా దూసుకుపోతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా.. ఉత్కంఠరేపుతూ సాగుతుంది. అంతేకాదు.. ప్రేక్షకులకు అదిరిపోయే థ్రిల్ పంచుతుంది. కొత్త పాయింట్ తో తెరకెక్కిన సినిమా పేరు కర్మణ్యే వాధికారస్తే. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి రెస్పా్న్స్ వస్తుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమా ఆర్యన్. ఉషస్విని ఫిల్మ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో తెరకెక్కించిన ఈ చితరంలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా కనిపించారు.

ఇందులో బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం కీలకపాత్రలు పోషించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమా మూడు కథలతో సమాంతరంగా సాగుతుంది. పృథ్వీ యాక్సిడెంట్ చేయడంతో ఒక వ్యక్తి మరణిస్తాడు. ఆ కేసు పోలీసాఫీసర్ అర్జున్ దగ్గరకి వస్తుంది. ఆ వ్యక్తి ముందే చనిపోయాడు. యాక్సిడెంట్ వల్ల కాదు అని పోస్టుమార్టంలో తెలుస్తుంది. ఆ తర్వాత అసలు ట్విస్టులు మొదలవుతాయి.

ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆద్యంతం ట్విస్టులతో సాగే ఈ సినిమాకు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతుంది. కర్మణ్యే వాధికారస్తే సినిమాకు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది.