Manisha Koirala: అందరూ వదిలేశారు.. మద్యానికి బానిసయ్యాను.. ఎమోషనల్ అయిన నటి

|

May 13, 2024 | 12:28 PM

హిందీ సినిమా సౌదాగర్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత తమిళ్ లో 1995 తెరకెక్కిన బొంబాయి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఆతర్వాత మనీషా కొయిరాలాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.

Manisha Koirala: అందరూ వదిలేశారు.. మద్యానికి బానిసయ్యాను.. ఎమోషనల్ అయిన నటి
Manisha Koirala
Follow us on

సినిమా ఇండస్ట్రీ ఊపేసిన హీరోయిన్స్ లో మనీషా కొయిరాలా ఒకరు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు మనీష కొయిరాల. మనీషా  ఓ నేపాలీ నటి. ఆమె ముందుగా మోడలింగ్ చేసి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చారు . హిందీ సినిమా సౌదాగర్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత తమిళ్ లో 1995 తెరకెక్కిన బొంబాయి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఆతర్వాత మనీషా కొయిరాలాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. బొంబాయి, భారతీయుడు , ఒకే ఒక్కడు, క్రిమినల్, ముంబాయి ఎక్స్‌ప్రెస్ , నగరం (స్పెషల్ సాంగ్) సినిమాలతో మనీషా కొయిరాలా పేరు మారుమ్రోగింది.

ఆ తర్వాత బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. అక్కడ ఆమె నటించిన దిల్ సే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చాలా రోజుల తర్వాత తాజాగా హీరమండి: డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచింది మనీషా. ఈ సిరీస్ కు టాప్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే మనీషా కొయిరాలా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మనీషా చాలా మంది హీరోలతో డేటింగ్ చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. స్టార్ హీరోలతో మనీషా ప్రేమలో పడిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆమె సామ్రాట్ దహల్ ను వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. ఈ ఇద్దరూ విడిపోయారు. ఆతర్వాత మనీషా డిప్రషన్ లోకి వెళ్ళిపోయింది. ఓవైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే ఇటు భర్తతో విడిపోవడంతో ఆమె ఒత్తిడికి లోనైంది. ఆ సమయంలోనే మద్యానికి బానిసయ్యింది. విపరీతంగా మద్యం సేవించేది మనీషా. అలాగే 2012లో ఆమెకు క్యాన్సర్ అని తెలిసింది. అలాంటి కష్టసమయంలో తనకు ఎవ్వరూ అండగా నిలవలేదు అని తెలిపింది మనీషా. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. జనాలు ఎవ్వరి భాదను పట్టించుకోరు. కష్టాల్లో ఉన్నారనగానే మనల్ని ఒంటరిగా వదిలేసి పోతారు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. నా స్నేహితులే కాదు బంధువులు ఎవరూ కూడా నాకు అండగా నిలవలేదు. నేనెలా ఉన్నాను.. నా ఆరోగ్యం ఎలా ఉంది.. అనేది పట్టించుకోలేదు. అప్పుడు కేవలం నా తల్లిదండ్రులు, సోదరుడు-వదిన మాత్రమే నాకు అండగా నిలిచారు. అప్పుడే నాకు మనుషుల వ్యక్తిత్వాల గురించి బాగా అర్థం అయ్యింది అని చెప్పుకొచ్చింది మనీషా కొయిరాలా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.