Divya Pillai: రొమాంటిక్ సీన్స్ గురించి మంగళవారం బ్యూటీ బోల్డ్ కామెంట్స్.. అంతమాట అనేసిందేంటీ.!

|

Apr 29, 2024 | 7:11 PM

మంగళవారం కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలోనూ పాయల్ మరోసారి తన బోల్డ్ యాక్టింగ్ తో కట్టిపడేసింది. మంగళవారం సినిమా సూపర్ హిట్ తో కావడంతో పాయల్ కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే పాయల్ రాజ్ పుత్ తో పాటు మరో బ్యూటీ కూడా మంగళవారం సినిమాలో బోల్డ్ గా నటించి మెప్పించింది.

Divya Pillai: రొమాంటిక్ సీన్స్ గురించి మంగళవారం బ్యూటీ బోల్డ్ కామెంట్స్.. అంతమాట అనేసిందేంటీ.!
Divya Pillai
Follow us on

అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత పాయల్ రాజ్ పుత్ తో కలిసి తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే బోల్డ్ గా నటించి మెప్పించింది పాయల్. రొమాంటిక్స్ సీన్స్ లోనూ రెచ్చిపోయి నటించింది. అలాగే మంగళవారం కూడా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలోనూ పాయల్ మరోసారి తన బోల్డ్ యాక్టింగ్ తో కట్టిపడేసింది. మంగళవారం సినిమా సూపర్ హిట్ తో కావడంతో పాయల్ కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే పాయల్ రాజ్ పుత్ తో పాటు మరో బ్యూటీ కూడా మంగళవారం సినిమాలో బోల్డ్ గా నటించి మెప్పించింది.

ఆ చిన్నదాని పేరు దివ్య పిళ్లై. మంగళవారం సినిమా తర్వాత ఈ చిన్నదానికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో శృంగార సన్నివేశంలో నటించింది దివ్య పిళ్లై. తాజాగా ఈ అమ్మడు రొమాంటి సీన్స్ లో నటించడం పై ఆస్కతికర కామెంట్స్ చేసింది. శృంగార సన్నివేశంలో నటించడం అంత ఈజీ కాదు అంటుంది దివ్య పిళ్లై.

తెరపై చూసే దానికి తెరవెనుక జరిగే దానికి చాలా తేడా ఉంటుంది. అది అందరికి తెలియదు అంటుంది దివ్య పిళ్లై. ఆమె మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్స్ అనగానే ఇద్దరూ ముద్దులు పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడం మాత్రమే అని అంతా అనుకుంటారు. కానీ షూటింగ్ లో అంతమంది ముందు ఆ సీన్స్ చెయ్యడం అంత  ఈజీ విషయం కాదు అని తెలిపింది దివ్య. శృంగార సన్నివేశంలో దాదాపు 75 కేజీలు ఉన్న మనిషి మన పైన పడుకున్నప్పుడు కెమెరాకు కనిపించేలా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం చాలా కష్టం.. అలాగే ముద్దు సీన్స్ లో ఆ ముద్దును ఎంజాయ్ చేస్తున్నట్టు హావభావాలు పలికించాలి అది ఎంతో కష్టం. అలాగే రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు మనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అది మన మొఖంలో కనిపించకుండా చూసుకోవాలి.. అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

దివ్య పిళ్ళై ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.