Manchi Rojulochaie: ఓటీటీలో సందడి చేయనున్న మంచి రోజులు వచ్చాయి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

సంతోష్‌ శోభన్, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతి దర్శకత్వం వహించారు. అజయ్‌ ఘోష్‌, వెన్నెల కిశోర్‌, సప్తగిరి, వైవా హర్ష,

Manchi Rojulochaie: ఓటీటీలో సందడి చేయనున్న మంచి రోజులు వచ్చాయి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Updated on: Nov 24, 2021 | 8:47 PM

సంతోష్‌ శోభన్, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతి దర్శకత్వం వహించారు. అజయ్‌ ఘోష్‌, వెన్నెల కిశోర్‌, సప్తగిరి, వైవా హర్ష, ప్రవీణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. యూవీ కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. అనూప్‌ రూబెన్స్‌ సంగీత స్వరాలు సమకూర్చారు. దీపావళి కానుకగా ఈనెల 4న విడుదలైన ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది.

ఈక్రమంలో ఇప్పుడు ఓటీటీలో కూడా అలరించేందుకు ‘మంచి రోజులు వచ్చాయి’ సిద్ధమవుతోంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ‘ఆహా’ సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 3 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ సినిమా కథను కేవలం 20 రోజుల్లోనే రాసి..30 రోజుల్లోనే తీశానని దర్శకుడు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన గోపిచంద్‌తో కలిసి ‘పక్కా కమర్షియల్‌’ అనే సినిమాను తీస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.Also Read:

Trisha: ఈ విషయం తెలిసి నా గుండె బద్దలైంది !! వీడియో

Raj Tarun: అందుకే వెబ్ సిరీస్ చేయలేదు.. అసలు విషయం చెప్పిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

Lakshya: రిలీజ్‌కు రెడీ అయిన నాగ శౌర్య మూవీ.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

Loading...
Unable to load recommendations.
Follow Us