Cinema: సినిమా ఇండస్ట్రీలో సమ్మె సైరన్.. షూటింగులు, థియేటర్లు అన్నీ బంద్‌.. ఎప్పటినుంచంటే?

సినిమా ఇండస్ట్రీలో సమ్మె సైరన్ మోగనుంది. నిరవధిక సమ్మెతో సినిమా షూటింగులు ఆగిపోనున్నాయి. థియేటర్లలో సినిమాల ప్రదర్శనలు కూడా నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్స్ నెరవేర్చేవరకు సమ్మె విరమించ బోమని ఇప్పటికే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంఘాలు తేల్చి చెప్పేశాయి. దీంతో మొత్తానికి సినీ పరిశ్రమ షట్ డౌన్ కానుంది.

Cinema: సినిమా ఇండస్ట్రీలో సమ్మె సైరన్.. షూటింగులు, థియేటర్లు అన్నీ బంద్‌.. ఎప్పటినుంచంటే?
Cinema Theatre

Updated on: Feb 15, 2025 | 8:10 PM

కేరళలో సినిమా ఇండస్ట్రీ సమ్మె సైరన్ మోగింది. జూన్‌ ఒకటి నుంచి మాలీవుడ్‌ సమ్మె బాట పట్టనుంది. దీంతో షూటింగులు బంద్‌ కానున్నాయి. థియేటర్ల ప్రదర్శనలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు నిరవధికంగా సమ్మెను కొనసాగించనున్నట్లు ఫిల్మ్ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ ప్రకటించింది. భారీగా పెరిగిన సినిమాల బడ్జెట్లు, తగ్గిన సక్సెస్‌ శాతం, నటీనటులతో పాటు పారితోషికం పెంచిన టెక్నీషియన్లు, నిర్మాతల మీద పెరుగుతున్న భారం, తదితర సమస్యలను పరిష్కరించుకోవడానికే సమ్మె కు దిగనున్నట్లు ఫిల్మ్ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ తెలిపింది. కాగా ఈ సమ్మె ప్రభావం టాలీవుడ్ తో పాటు మిగిలిన ఇండస్డ్రీల మీద పడనుంది. మొత్తానికిజూన్‌ నుంచి రిలీజ్‌ అయ్యే సినిమాల మలయాళ వెర్షన్ల పరిస్థితి గందరగోళం గా మారింది. రాష్ట్ర వినోదపు విన్ను, పారితోషికాలు తగ్గుముఖం పడితే తప్ప.. సమ్మె విరమించబోమని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు.

 

ఇవి కూడా చదవండి

మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు ‘ఆవేశం,’ ‘ఏఆర్‌ఎమ్, భ్రమయుగం.. ఇలా గతేడాది ఎన్నో మలయాళ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. తక్కువ బడ్జెట్ తోనే భారీ వసూళ్లు రాబట్టాయి. ఇక కరోనా తర్వాత ఓటీటీల ద్వారా కూడా మలయాళ చిత్రాలకు ఇతర భాషల ప్రేక్షకాదరణ బాగా పెరిగింది. అయినప్పటికీ ప్రస్తుతం మలయాళ సినిమా పరిశ్రమ కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సమ్మె ప్రభావం టాలీవుడ్ పై ఏ మేర ఉంటుందో చూడాలి.

టాలీవుడ్ పైనా ప్రభావం !

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.