Nazriya Nazim: నా భర్త అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన నజ్రియా

|

Jan 15, 2025 | 8:14 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు ఫహద్ ఫాజిల్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ మాస్ మసాలా పాత్రలో కనిపించిన పుష్ప సినిమాలో ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.

Nazriya Nazim: నా భర్త అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన నజ్రియా
Nazriya Nazim, Fahad Fazil
Follow us on

నజ్రియా నజీమ్. మలయాళంలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే తెలుగు ఒకే ఒక్క సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన నటించింది నజ్రియా నజీమ్. అంటే సుందరానికి అనే సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించింది నజ్రియా నజీమ్. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ వయ్యారి భామ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా నజ్రియా నజీమ్ తన భర్త ఫహద్ ఫాజిల్ గురించి ఓ షాకింగ్ విషయాన్ని చెప్పింది.

ఇది కూడా చదవండి :ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు

నజ్రియా రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.  2014లో అంజలి రచన దర్శకత్వం వహించిన బెంగుళూరు డేస్ చిత్రంలో నజ్రియా నటించింది. ఇందులో ఫహద్ ఫాజిల్ నజ్రియా భర్తగా నటించాడు. ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.  దాని తర్వాత నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిపోయారు. పెళ్లి తర్వాత ఈ జంట తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. నజ్రియా మలయాళంలో సినిమాలు చేస్తుంటే.. ఫహద్ ఫాజిల్ రీసెంట్ గా తెలుగులో పుష్ప 2తో భారీ హిట్ అందుకున్నాడు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి హైప్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో ఈ క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్

తాజాగా తన భర్తకు అరుదైన వ్యాధి ఉందని నజ్రియా తెలిపింది. ఫహద్ కొన్ని నెలల నుంచి ADHDతో బాధపడుతున్నట్లు తెలిపింది. ADHD ఉన్నవారు శ్రద్ధ లోపంతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు ఎప్పుడూ..పరధ్యానం, చికాకు కలిగి ఉంటారు. ఈవ్యాధితో బాధపడుతున్న వారిలో హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నట్లు కూడా సమాచారం. తన భర్త ఫాజిల్  ఈ వ్యాధిని ఎలా ఎదుర్కొన్నాడో నజ్రియా తెలిపింది. ఈ పరిస్థితి గురించి ఇప్పుడు మనకు బాగా తెలుసు. నేను కొంచెం ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ అది తప్ప మా జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు” అని తెలిపింది నజ్రియా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి