మలయాళ స్టార్ హీరో శ్రీనాథ్ భాసీని (Sreenath Bhasi) కేరళ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇటీవల తన రాబోయే చిత్రం చట్టంబి ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రీనాథ్ సదరు మహిళా యాంకర్‌పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆమెపై కోపంతో దుర్భాషలాడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనాథ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. అతడిపై సెక్షన్ 354, 509, 294బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శ్రీనాథ్ కప్పెలా, భీష్మ పర్వం, ట్రాన్స్ చిత్రాలతో మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారాడు.
శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం చట్టంబి. అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రీనాథ్ సహనం కోల్పోయి.. సదరు మహిళా యాంకర్ పై విరుచుకుప్డడాడు. అసభ్యమైన పదజాలంతో ఆమెను దుర్భాషలాడడాడు. దీంతో సదరు యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనతో అసభ్యంగా మట్లాడిన మాటలను రికార్డ్ చేసి పోలీసులకు వినిపించింది. దీంతో అతడిపై విమెన్ హెరాస్మెంట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశార పోలీసులు. అయితే తన అరెస్ట్ ను శ్రీనాథ్ ఖండించారు. సదరు యాంకర్ తనను అగౌరవపరుస్తూ ప్రశ్నలు అడగడంతో తాను సహనం కోల్పోయినట్లుగా చెప్పుకొచ్చారు.