
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్టులో నటిస్తోంది హీరోయిన్ మాళవిక మోహనన్. ఇటీవల ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన యాక్షన్ సీన్ వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ లండన్ లో సందడి చేస్తుంది. ఇక అక్కడి నుంచి నిత్యం లేటేస్ట్ ఫోటోస్ ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఇటీవల బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో విదేశీ వీధుల్లో ఫోటోషూట్ చేసింది మాళవిక. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట పంచుకోగా.. తెగ వైరలయ్యాయి. అదే సమయంలో ఆమె ధరించిన హ్యాండ్ బ్యాగ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. మాళవిక ధరించిన ఆ హ్యాండ్ బ్యాగ్ క్లాసిక్ ఛానెల్ క్విల్టెడ్ బ్రాండ్. ఆ బ్యాగ్ ధర రూ.10.25 లక్షలు అని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
తమిళంలో రజినీకాంత్ నటించిన పెట్ట సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది మాళవిక. ఆ తర్వాత మారన్, తంగాలన్ చిత్రాల్లో నటించింది. తమిళంతోపాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి అలరించింది. ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నెట్టింట మాత్రం నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ స్లీవ్ లెస్ చిట్టిగౌనులో ఫోజులిచ్చింది. గోల్డెన్ హోప్స్, చిక్ స్లింగ్ బ్యాగ్ ఆమె ప్రయాణ రూపానికి పర్ఫెక్ట్ టచ్ ఇచ్చింది.
ఇక తెలుగులో విజయ్ దేవరకొండతో నటించాలనేది తన కోరిక అంటూ గతంలో చెప్పుకొచ్చింది మాళవిక. రొమాంటిక్ లేదా కామెడీ సినిమా చేయాలని ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ జోడిగా రాజా డీలక్స్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీ హరర్ జోనర్ లో ఉండబోతుందని తెలుస్తోంది. రాజా డీలక్స్ తర్వాత తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకోనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.