‘గుంటూరు కారం ‘ ప్రమోషన్స్ జోరు కొనసాగుతుంది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు మరికొద్ది రోజుల్లో తెర పడనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో సినిమా ‘గుంటూరు కారం’. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మహేష్ యాక్షన్ మాస్ లుక్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. ఇక ప్రచారాల్లో భాగంగా విడుదలైన పాటలు సైతం శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన కుర్చీ మడతపెట్టి పాటతో మూవీపై మరింత హైప్ నెలకొంది. ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా రన్ టైమ్ ఫిక్స్ అయినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం 159 నిమిషాలు (2 గంటల 39 నిమిషాలు) ఉంటుందట. రేపు (జనవరి 6న) హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో గుంటూరు కారం ట్రైలర్ విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందుకోసం ఘట్టమనేని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ అంటూ మేకర్స్ గట్టిగా చెప్పడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల మధ్య పోటీ ఏర్పడనుంది. ముఖ్యంగా గుంటూరు కారం, హనుమాన్ సినిమాల మధ్య పోటీ ఎక్కువే ఉండనుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఓవైపు శరవేగంగా ప్రమోషన్స్ జరుపుతున్న ఈ సినిమా రన్ టైమ్ సైతం ఫిక్స్ అయ్యింది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా 158 నిమిషాలు అంటే 2 గంటల 38 నిమిషాలు ఉందట. అంటే గుంటూరు కారం సినిమా కంటే ఒక నిమిషం తక్కువ.
The Highly Inflammable Entertainer ~ #GunturKaaram is 𝐂𝐄𝐍𝐒𝐎𝐑𝐄𝐃 with 𝐔/𝐀 💥💥
All set to SPICE up the screens with the entertainment like never before! 🔥🕺🥳
WW Grand Release at theatres near you on JAN 12th! 🔥
Super🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman… pic.twitter.com/TeBN9G3SBG
— Haarika & Hassine Creations (@haarikahassine) January 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.