Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీలుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యాయంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో శరవేగంగా జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు కూడా లీకుల బెడద తప్పేలా లేదు. ఇప్పటికే మహేష్ లొకేషన్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓవైపు చిత్రబృందం నుంచి కొన్ని అధికారిక ఫోటోలు వచ్చేస్తున్నా.. మరోవైపు ఈ లీకులు ఇబ్బందికరంగానే మారాయి.ఇప్పటికే రాజమౌళి తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం”, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” , పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “వకీల్ సాబ్”చిత్రాలకు సంబంధించి అనేక లీకులు బయటకు వచ్చాయి. ఇప్పుడు సర్కారు వారి పాట కూడా లీకుల బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది.ఇక ఈ సినిమాను మైత్రిమూవీస్ తో పాటు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్.. 14రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మించనున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :
మరో ప్రాజెక్టును స్టార్ట్స్ చేయనున్న మెగా హీరో.. ఈసారి నూతన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన తేజ్..