Mahesh Babu: నాని మూవీ సాంగ్ చూసి ఎమోషనల్ అయిన మహేష్ బాబు ..

దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు హాయ్ నాన్న అంటూ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మృణాల్ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు నాని తో కలిసి సినిమా చేస్తోంది.

Mahesh Babu: నాని మూవీ సాంగ్ చూసి ఎమోషనల్ అయిన మహేష్ బాబు ..
Mahesh Babu

Updated on: Oct 07, 2023 | 3:05 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హయ్ నాన్న. నాని రీసెంట్ గా దసరా సినిమాతో హిట్ అందుకున్నాడు. నాని ఊర మాస్ లుక్ లోకి మారి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటించింది. దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు హాయ్ నాన్న అంటూ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మృణాల్ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు నాని తో కలిసి సినిమా చేస్తోంది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

తండ్రి కూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల మందికి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి గాజు బొమ్మ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ అందమైన సాంగ్ తండ్రి కూతురికి మధ్య సాగే పాట. ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈసాంగ్ పై మహేష్ బాబు రియాక్ట్ అయ్యారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా లో ఈసాంగ్ లింక్ ను షేర్ చేస్తూ.. చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. ‘ఒక తండ్రి నుంచి అతని కుమార్తె వరకు.. ప్రతి తండ్రి మదిలో ప్రతి ధ్వనించే పాట ఇది. హాయ్ నాన్న చిత్రబృందానికి నా ఆల్‌ ది బెస్ట్ అంటూ మహేష్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. హాయ్ నాన్న సినిమాకు అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు.

మహేష్ బాబు ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.