Sarkaru Vaari Paata Day 1 Box Office Collections: బాక్సాఫీస్ వద్ద వేట షూరు చేసిన మహేష్.. సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్..

డైరెక్టర్ పరశురామ్.. మహేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా గురువారం విడుదలై హిట్ టాక్‏తో దూసుకుపోతుంది

Sarkaru Vaari Paata Day 1 Box Office Collections: బాక్సాఫీస్ వద్ద వేట షూరు చేసిన మహేష్.. సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్..
Sarkaru Vaari Paata

Updated on: May 13, 2022 | 11:51 AM

సర్కారు వారి పాట (Sarkaru vaari paata ) సినిమాతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట షూరు చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ పరశురామ్.. మహేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా గురువారం విడుదలై హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. ఉదయం నుంచి థియేటర్ల వద్ద అభిమానులు నానా హంగామా చేశారు.. సర్కారు వారి పాట చిత్రాన్ని చూసేందుకు అభిమానులే కాకుండా.. సామన్య ప్రేక్షకుల సైతం బ్రహ్మరథం పట్టారు. విడుదలైన ఒక్కరోజులోనే బాక్సాఫీస్ వద్ద భారీ బిజినెస్ చేస్తోంది. ఈ సినిమా ఇండియన్ మార్కెట్‏లోనే కాకుండా.. ఓవర్సీస్‏లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. దక్షిణాదిలో సర్కారు వారి పాట బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ ను ప్రముఖ సినీ విమర్శకుడు రమేష్ బాలా ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ వసూళ్ల వేట కొనసాగుతున్నాడని.. మొదటి రోజే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టినట్లు తెలిపారు. మొదటి రోజే నైజాంలో రూ. 12.24 కోట్లు వసూలు చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 36.63 కోట్లు రాబట్టింది సంచలనం సృష్టించింది..

సీడెడ్.. రూ.4.7 కోట్లు..
యూఏ.. రూ.3.73 కోట్లు.
తూర్పు.. రూ.3.25 కోట్లు.
పశ్చిమ.. రూ.2.74 కోట్లు.
గుంటూరు.. రూ.5.83 కోట్లు.
కృష్ణా.. రూ.2.58 కోట్లు.
నెల్లూరు.. రూ.1.56 కోట్లు.
తెలుగు రాష్ట్రాలు.. రూ. 36.63 కోట్లు.

సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా.. సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Vijay Devarakonda: నా కెరీర్‏లోనే అత్యంత పెద్ద సినిమా ఇదే.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ..

Sivakarthikeyan: పాన్ ఇండియా చిత్రాలపై స్పందించిన తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్.. అలా ఉంటేకే నటిస్తాంటూ..

Kamal Haasan: క్రేజీ కాంబో.. కమల్ సినిమాలో హీరో సూర్య ?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

Gurthunda Sheethakalam: ఎట్టకేలకు  విడుదలకు సిద్ధమైన ఫీల్ గుడ్ లవ్‏స్టోరీ.. థియేటర్లలో సందడి చేయనున్న గుర్తుందా శీతాకాలం..