
టాలీవుడ్‌లో ఇప్పుడు ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత రెండు రోజులుగ ఎక్కడ చూసినా ఈ ఇద్దరి ఫోక్ ఆర్టిస్టుల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు. తమదైన ఫోక్ సాంగ్స్ తో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి, మాధురి ఒకే రూమ్ లో కనిపించడంతో ఈ వివాదం మొదలైంది. సరిగ్గ అదే సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వెళ్లి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం, అందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు సార్లు స్పందించాడు ఈశ్వర్ సాయి. తానెందుకు మాధురి గదిలో ఉండాల్సిందో వివరణ ఇస్తూ వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. కేవలం తాను మాధురి రాథోడ్ వాష్‌రూమ్ వాడుకోవడానికి మాత్రమే వెళ్లానని, అదే సమయంలో ఎవరో తన భార్యకు తప్పుడు సమాచారం ఇచ్చారంటున్నాడు ఈశ్వర్. ఈ విషయాన్ని అప్పుడే తన భార్యకు చెప్పానని అయితే ఆమె వినలేదంున్నాడు. మాధురితో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన విషయం వాస్తవమేనని కానీ చాలా మంది అనుకుంటున్నట్లుగా మా మధ్య అంత వరకు వెళ్లే సీన్ లేదంటున్నాడు ఈశ్వర్ సాయి.
తాజాగా ఇదే వివాదంపై మాధురి రాథోడ్ కూడా స్పందించింది. ఈ మేరకు తనను ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్ గా ఒక వీడియోను రిలీజ్ చేసింది. ‘ నాకు తెలుగు ప్రజలకు ఇలాంటి విషయాలపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుందని. మంచి మంచి వీడియోలు చేస్తే వాటిని ఎవరూ ఆదరించలేదు. ఇలాంటి గొడవలు, వివాదాలపైనా అయితే మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను గత 30 రోజులగా మినీ వ్లాగ్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఉపయోగకరమైన కంటెంట్ అందిస్తున్నప్పటికీ వాటికంటే వివాదాలకే ఎక్కువ ఆదరణ వస్తోంది. ఈ గొడవ చూస్తుంటే మీకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కదా’ అని వీడియోలో చెప్పుకొచ్చింది మాధురి. ప్రస్తుతం ఈ ఫోక్ సింగర్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మాధురి రాథోడ్‌పై వైరల్ ప్రచారం.. ఆమె స్పందన ఇదే..
ఈశ్వర్ సాయితో మాధురి రాథోడ్ గదిలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై ఆమె తాజా స్పందనలో వైరల్ గొడవలు, వివాదాలపై ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి ఉంటోందని వ్యాఖ్యానించారు.
తాను 30 రోజుల మినీ వ్లాగ్… pic.twitter.com/W5JpJ2gxky
— Telugu Stride (@TeluguStride) August 24, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.