Sai Dharam Tej Bike Accident: సాయి ధరమ్ తేజ్ సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నాడు.. ప్రమాదంపై పూర్తి వివరాలను ప్రకటించిన పోలీసులు..

|

Sep 11, 2021 | 9:47 PM

యంగ్ హీరో.. మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 7-30

Sai Dharam Tej Bike Accident: సాయి ధరమ్ తేజ్ సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నాడు.. ప్రమాదంపై పూర్తి వివరాలను ప్రకటించిన పోలీసులు..
Sai Dharam
Follow us on

యంగ్ హీరో.. మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 7-30 ప్రాంతంలో మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు. దీంతో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అతడిని మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై మట్టి, బురద ఉండడం వల్లే స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ ప్రమాదం జరిగినట్లు అంచనాకు వచ్చిన సంగతి తెలసిందే.. ప్రస్తుతం సాయి తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తేజ్‏కు అంతర్గతంగా గాయాలు కాలేదని.. ప్రస్తుతం చికిత్సకు సహకరిస్తున్నారని తెలిపారు. డాక్టర్ ఆలోక్ రంజన్ నేతృత్వంలో వైద్యం అందిస్తున్నారు అపోలో వైద్య బృందం. మరో 24 గంటలకు సాయి ధరమ్‏ను అబ్జర్వేషన్‏లో ఉంచనున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై మాదాపూర్ పోలీసులు అధికారక ప్రకటన చేశారు. సాయి ధరమ్‌ తేజ్‌ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను కొనుగోలు చేశారని మాదాపూర్‌ డీసీపీ తెలిపారు. ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి తేజ్ బైక్ కొన్నాడని..ప్రస్తుతం అనిల్‌కుమార్‌ను పిలిచి విచారిస్తున్నామని మాదాపూర్‌ డీసీపీ తెలిపారు. ప్రమాదానికి కారణమైన బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఇంకా పూర్తి కాలేదని.. బైక్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపుతున్నట్లుగా తెలిపారు మాదాపూర్‌ డీసీపీ. గతంలో కూడా మాదాపూర్‌లోని పర్వతాపూర్‌ వద్ద ఓవర్‌ స్పీడ్‌పై రూ.1,135 చలాన్‌ వేశామని.. ఈ చలాన్‌ను ఈ రోజు సాయి ధరమ్‌ తేజ్‌ అభిమాని క్లియర్‌ చేశారని చెప్పారు. ఇక రోడ్డు ప్రమాదం సమయంలో తేజ్ దాదాపు 72 కి.మీ. స్పీడ్‌తో వెళ్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం కంటే ముందు దుర్గం చెరువుపై 102 కి.మీ. వేగంతో బైక్‌ నడుతుపున్నారని.. రాష్‌ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపారని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఆటోను లెఫ్ట్‌ సైడ్‌ నుంచి ఓవర్‌ టెక్‌ చేయబోయి స్కిడ్‌డై తేజ్ కిందపడ్డాడని.. అతని వద్ద నుంచి టూ వీలర్‌ నడిపే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తమకు లభించలేదని మాదాపూర్ తెలిపారు. తేజ్ దగ్గర లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ చేసే లైసెన్స్‌ మాత్రమే ఉందని మాదాపూర్ డీసీపి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రమాదం సమయంలో తేజ్ హెల్మెట్‌ ధరించి ఉన్నాడని.. అందుకే ప్రాణాపాయం నుంచి బయటపడినట్లుగా మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇక ఉదయం నుంచి అపోలో ఆసుపత్రికి సెలబ్రెటీలు క్యూ కట్టారు. తరుణ్, శ్రీకాంత్, మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్లి తేజ్‏ను పరామర్శించారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరగానే కోలుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పారు.

Also Read: Sai Dharam Tej-Naresh: సాయి ధరమ్ ప్రమాదంపై తాను చేసిన వ్యాఖ్యలపై నరేష్ వివరణ.. తన బిడ్డలాంటివాడు.. బాగుండాలని కోరుకుంటున్నా…

Seema Politics: సీమ టీడీపీ నేతల సదస్సుకు వైసీపీ కౌంటర్.. కమ్మభవన్‌లో నిర్వహించడం పై మీ ఆంతర్యం ఏంటని ప్రశ్న