బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్స్‌లో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ పాల్గొన్నారని బెంగళూరు పోలీసు కమిషనర్ ధ్రువీకరించారు . అలాగే ఆ రోజు తీసిన బ్లడ్ శాంపిల్ ను పరీక్షలకు పంపగా.. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో కరాటే కల్యాణి, సహా పలువురు సినీ ప్రముఖులు హేమపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇదే విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షులు మంచు విష్ణు హేమకు మద్దతుగా ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ‘సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు నటి హేమను లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఒక తల్లిగా, భార్యగా ఉన్న ఆమెపై ఇలాంటి లేని పోని వదంతులు సృష్టించడం, వ్యక్తిగతంగా దూషించడం తగదు. నిర్ధారణ లేని, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలి. హేమపై ఇంకా నేరం రుజువు కాలేదు. కాబట్టి ఆమె దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుంది. హేమకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను పోలీసులు అందిస్తే ‘మా’ అసోసియేషన్ తరఫున తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటివరకు హేమపై నిరాధారమైన ఆరోపణలను సంచలనాల కోసం ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ట్విట్టర్ వేదికగా కోరారు మంచు విష్ణు.
ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కాగా బెంగళూరులో రేవ్ పార్టీ కేసులో హేమ పేరు వినిపించడం టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. తాను రేవ్ పార్టీలో లేనని, హైదరాబాద్ లోనే ఉన్నానని హేమ వీడియో విడుదల చేసింది. అయితే హేమ రేవ్ పార్టీలోనే ఉందని స్వయంగా పోలీస్ కమిషనర్ చెప్పారు. అలాగే హేమ బ్లడ్ శాంపిల్‌ను పరీక్షలకు పంపగా పాజిటివ్‌గా రావడంతో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరు పోలీసులు త్వరలోఈ టాలీవుడ్ నటిని విచారణకు పిలవనున్నారు.
Regarding the recent drug-related case at a rave party, few media outlets and individuals are making baseless allegations about actress Ms.Hema.
I urge everyone to refrain from jumping to conclusions and spreading unverified information. Ms.Hema deserves to be presumed innocent…
— Vishnu Manchu (@iVishnuManchu) May 25, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.