Maa Elections 2021: ఎక్స్‌ట్రాలు ఆపండి..! నరేశ్‌ వ్యాఖ్యలపై శ్రీకాంత్ సీరియస్‌..

Maa Elections 2021: 'మా' ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ డబ్బులు పంచుతున్నారని ప్రస్తుత 'మా' అధ్యక్షుడు

Maa Elections 2021: ఎక్స్‌ట్రాలు ఆపండి..! నరేశ్‌ వ్యాఖ్యలపై శ్రీకాంత్ సీరియస్‌..
Srikanth Warning

Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2021 | 8:36 AM

Maa Elections 2021: ‘మా’ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ డబ్బులు పంచుతున్నారని ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీచేస్తున్న హీరో శ్రీకాంత్‌ స్పందించారు. నరేశ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వాళ్లే మనుషులను పెట్టి డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. అంతేకాదు ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ పంచుతున్నట్లుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ‘మా’ సభ్యులందరు ఈ విషయాన్ని గమనించాలని, ఇలాంటి కల్చర్‌లెస్ పనులు చేయాల్సిన అవసరం మాకు లేదని అమ్మవారిపై ఒట్టేసి చెప్పారు. ఇలాంటి ఆరోపణలు ఇంతటితో ఆపాల్సిందిగా నరేశ్‌కి వార్నింగ్ ఇచ్చారు.

శ్రీకాంత్‌ ఇలా మాట్లాడాడు.. ‘ఇప్పుడే నరేష్‌గారి వీడియో చూశా.. ఎందుకండీ ఇంకా అబద్దాలు మాట్లాడుతారు.. మేము డబ్బులు పంచుతున్నామా? మూడు నాలుగు సెంటర్లలో డబ్బులు పంచుతున్నామా? మీరు డబ్బులు వేరే వాళ్లతో పంపించి.. ప్రకాశ్ రాజ్ డబ్బులు ఇస్తాడని చిత్రీకరిస్తున్నారు.. ఆపేయండి సార్.. ఇక్కడితో ఆపేయండి. ఇంకా ఎక్స్‌ట్రాలు ఏమీ మాట్లాడవద్దు. దయచేసి మెంబర్స్ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. నరేష్ గారు వాళ్లు చేసే పని మా మీద రుద్దడానికి ట్రై చేస్తున్నాడు. దయచేసి.. మెంబర్స్ అందరూ అర్థం చేసుకోండి. మా లైఫ్‌లో అటువంటి కల్చర్‌లెస్ పనులు చేయం. దసరా సందర్భంగా పూజలందుకుంటున్న అమ్మవారి మీద ఒట్టేసి చెబుతున్నాం’ అని తెలిపారు.

Maa Elections 2021: ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్ డబ్బులు పంచుతుందట..! ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ కామెంట్స్‌

Maa Elections 2021: నాగబాబుకు మంచు విష్ణు కౌంటర్.. ‘కుటుంబం జోలికొస్తే సహించేది లేదు’..

Viral Video: ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. ఈ వీడియో చుస్తే నవ్వుకోవాలో జాలి చూపించాలో మిరే చెప్పండి..