Maa Elections 2021: అంతా మీ ఇష్టం.. కానీ ఆ ఒక్క పదవి మాత్రమే నాకివ్వండి.. వినూత్నంగా బండ్ల గణేష్ ప్రచారం…

|

Sep 25, 2021 | 8:32 PM

మా ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు తమ ప్యానల్ సభ్యులను

Maa Elections 2021: అంతా మీ ఇష్టం.. కానీ ఆ ఒక్క పదవి మాత్రమే నాకివ్వండి.. వినూత్నంగా బండ్ల గణేష్ ప్రచారం...
Bandla Ganesh
Follow us on

మా ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు తమ ప్యానల్ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనుండడంతో..మాలో ఎన్నికల వేడి పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలలో అభ్యర్థుల మధ్య పోటి పెరిగింది. ముఖ్యంగా ఈసారి ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు మధ్య అసలైన పోటీ ఉండబోతుంది. వీరిద్ధరు మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండగా.. కేవలం జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్రంగా పోటీ చేస్తున్నాడు బండ్ల గణేష్. ముందుగా ప్రకాష్ రాజ్ ప్యానల్‏లో ఉన్న బండ్ల గణేష్.. అనుహ్యంగా ఆ ప్యానల్ నుంచి తప్పుకుని స్వతంత్రంగా బరిలోకి దిగాడు.

అయితే ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో ఇటీవల ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు తమ ప్యానల్ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. సభలు, సమావేశాలు అంటూ ప్రచార కార్యక్రమాలను సైతం వేగవంతం చేశారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకున్నప్పటి నుంచి మా ఎన్నికలపై ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వచ్చాడు బండ్ల గణేష్.. తాజాగా ప్రచార బరిలోకి కూడా వినూత్నంగా దిగారు. సోషల్ మీడియా వేదికగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. తన ట్విట్టర్ ఖాతాలో.. ఒకే ఒక్క ఓటు.. మా కోసం.. మన కోసం.. మనందరి కోసం.. మా తరపున ప్రశ్నించడం కోసం అంటూ ట్వీట్ చేశారు. ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, జాయింట్‌ సెక్రటరీతోపాటు మిగిలిన ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా మీకు ఇష్టమైన వాళ్లను ఎన్నుకోండి. కానీ జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర, యువ నటీనటులను ట్యాగ్ చేస్తూ.. ట్వీట్ చేశారు.

ట్వీట్..

బండ్ల గణేష్ .. మొదటి నుంచి మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్‏కు మద్దతు ఇస్తూ వచ్చాడు. కానీ ప్రకాష్ రాజ్ టీంలోకి జీవిత రాజశేఖర్ రావడంతో.. వారి రాకను వ్యతిరేకిస్తూ.. ఆ టీం నుంచి తప్పుకున్నాడు. జీవితపై పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో జనరల్ సెక్రటరీ పదవి కోసం నేరుగా బరిలోకి దిగారు.

Also Read: Most Eligible Bachelor: అఖిల్ సినిమా మరోసారి వాయిదా పడనుందా..? అసలు విషయం ఏంటంటే..

Konda Polam: గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన వైష్ణవ్ తేజ్ ‘కొండపోలం’.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..